Bigg Boss Telugu 7: కప్పు కొట్టడం అంత ఈజీ కాదట.. కొడుకు ఇచ్చిన హింట్‌తో గెలవనని శివాజి ఫిక్స్ అయ్యాడా?
Sivaji Shcoking Comments: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఏ సీజన్ లోనూ ఇంద రసవత్తరంగా షో సాగలేదు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2షోలో కౌశల్ కొడుకు, కూతురు వచ్చినప్పుడు కల్గిన ఆసక్తి ఆ తర్వాత ఏషోలోనూ కనిపించలేదు. కానీ తాజాగా ఈ సీజన్ లో అలాంటి రసవత్తరమైన ఘటనే చోటు చేసుకుంది. శివాజి కొడుకును డాక్టర్ పంపి అందరిలోనూ ఆసక్తి క్రియేట్ చేశారు. హెల్త్ చెకప్ కోసం మెడికల్ రూంలోకి రమ్మంటూ శివాజిని పిలిచిన బిగ్ బాస్.. తన కొడుకు చేతే శివాజి ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కున్నారు.
ఈక్రమంలోనే డాక్టర్ తో మాట్లాడిన తర్వాత శివాజి వెనక్కి తిరిగి వెళ్లిపోతుండగా.. ఆయన కుమారుడు వెంకట్ నాన్నా అని పిలిచాడు. ఏం జరుగుతుందో అర్థం కాని శివాజి వెనక్కి తిరిగి అదో రకంగా మొహం పెట్టి చూశాడు. మాస్కు తీసిన వెంకట్ నాన్నా అనగానే శివాజి ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. వెంనటే గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. ఇక ఆ తర్వాత కొడుకును బయటకు తీసుకు వచ్చి మరీ.. ఏయ్ మై సన్ అంటూ కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు.

ఇలా శివాజి కొడుకు ఎంట్రీ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ సడెన్ గా అతడిని చూడగానే అంతా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. అందరూ అతడిని ఆప్యాయంగా మాట్లాడించారు. ఈక్రమంలోనే తండ్రీ కొడుకులు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తమ్ముడు వస్తాననుకున్నాను, నవ్వొచ్చావేంట్రా, నీకు సిగ్గు కదా అని శివాజి అడగ్గా.. తనకు యూనివర్సిటీలో సీటు వచ్చిందని.. వెళ్తే మళ్లీ కలిసే ఛాన్స్ రాదని తానే వచ్చినట్లు చెప్పాడు. కొడుకు వెళ్లిపోతే మరో 10 నెలల వరకు తిరిగి రాడని తెలుసుకున్న శివాజి మరోసారి ఎమోషనల్ అయ్యాడు.
ఇదంతా బాగానే ఉన్నా.. కొడుకు వెంకట్ మాత్రం శివాజికి హింట్ ఇచ్చాడు. తండ్రి చేతిలో చేయి పెట్టిన అతడు.. శివాజికి మాత్రమే అర్థం అయ్యేలా సూచనలు చేశాడు. బిగ్ బాస్ కెమెరాలు కూడా పదే పదే వాళ్ల చేతులను చూపించడంతో కొడుకు తొడలపై శివాజి ఏదో రాసినట్లుగా అర్థం అవుతుంది. అయితే దానికి కెన్నీ కూడా ఏదో సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నెట్టింట దీనిపై పెద్ద చర్చే సాగుతోంది. అయితే కొడుకు వచ్చి వెళ్లిపోయిన తర్వాత శివాజిలో కాస్త మార్పు కనిపిస్తోంది. అరే మనం ఇక్కడ వరకు వచ్చాం.. చాలు అంటూ అమర్ దీప్ తో చెప్పడం కూడా గమనార్హంగా మారింది.

అయితే తాజాగా వచ్చిన ప్రోమోలో కూడా శివాజి షాకింగ్ కామెంట్లు చేశాడు. బిగ్ బాస్ కప్పు కొట్టాలనే మొదట్లో అనుకున్నాను కానీ కప్పు కొట్టడం అంత సులువు కాదని చెప్పాడు. అంటే కొడుకు ఇచ్చిన హింట్ తో కప్పు కొట్టలేనని.. శివాజికి అర్థమైనట్లు అనిపిస్తోంది. ఇక్కడ వరకు వచ్చాను, నా భార్యకు నేను ఇచ్చే గిఫ్టు ఇదేనని శివాజి చెప్పడం కూడా చోద్యంగా అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందనేది.


Click it and Unblock the Notifications











