జబర్దస్త్ షోలో పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పెషల్ స్కిట్.. గెస్టుగా వెళ్లిన శివాజి ఏం చేశారంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు గురించీ.. మరీ ముఖ్యంగా ఈ సీజన్ విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలిసిందే. అయితే గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన ఈవెంట్ తర్వాత ఆయన అరెస్టు అయిన విధానం.. కంటెస్టెంట్ల కార్లపై రాళ్ల దాడి చర్చకు దారి తీసింది. ఆతర్వాత రైతుబిడ్డ అరెస్ట్ అవడం.. మళ్లీ విడుదల కావడం ఇలా అన్నీ సెన్సేషన్ అయ్యాయి. అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్లు పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పెషల్ స్కిట్ చేశారు. అయితే అక్కడికి గెస్టుగా వెళ్లిన శివాజి ఏం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఉన్న శివాజి.. బిగ్ బాస్ కు వెళ్లేకంటే ముందే #90స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. అయితే ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ వెబ్ సిరీస్ విడుదల కావడం.. సూపర్ డూపర్ హిట్టుగా నిలవడంతో సక్సెస్ పార్టీలు చేసుకుంటున్నారు. ప్రత్యేక కార్యక్రమాలకు వెళ్తూ.. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ లో తన పిల్లలుగా నటించిన ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్ లతో కలిసి శివాజి జబర్దస్త్ షోకు వెళ్లారు. తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటే ఆ విషయం మనకు తెలుస్తోంది.

ముఖ్యంగా ప్రోమో మొదట్లోనే శివాజి తన పిల్లలతో సహా స్టేజీ మీదకు రాగా.. టిల్లు మూవీ సాంగ్ పెట్టారు. ఫుల్ జోష్ తో తో అంతా స్టెప్పులు వేయగా.. యాంకర్ రష్మి వారికి వెల్ కమ్ చెప్పింది. ఈక్రమంలోనే శివాజి మాట్లాడుతూ.. తాను ప్రతీ గురువారం ఈ షో చూస్తానని.. తాను చాలా సేపు నవ్వుకోవడానికి ఇది కరెక్ట్ అని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటి వరకు తాను ఏ ఒక్క ఎపిసోడ్ ను కూడా మిస్ కాలేదని వివరించారు. ఇక ఆ తర్వాత జబర్దస్త్ టీం కమెడియన్లు వస్తూ స్కిట్ లు చేశారు.
ముందుగా వచ్చిన బుల్లెట్ భాస్కర్ టీం ఏఎన్నార్ సినిమా స్పూఫ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత ఆటో రాం ప్రసాద్ టీం సలార్ సినిమా కాన్సెప్ట్ తో వచ్చి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక చివరల్లో ఇమాన్యుయేల్ టీం వచ్చింది. అయితే వీళ్లు తీసుకున్న కాన్సెప్ట్ ఏ సినిమాదో కాదు. రియల్ లైఫ్ జరిగిన స్టోరీ. అది కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన తీరుతో కామెడీ చేసేందుకు వచ్చారు.

రైతుబిడ్డగా బాబును చూపించారు. బాబు అభిమానులు అంతా అతడికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పినట్లు చూపించి.. ఆ తర్వాత కారులో వెళ్తుండగా.. పోలీసులు వెళ్లిపోండి సార్ అని చెప్పడం చూపించారు. ఆగండి సార్ ఎందుకు వెళ్లాలంటూ ప్రశాంత్ అడిగిన సీన్ ను బాబు రీక్రియేట్ చేశారు. ఆ తర్వాత యువర్ అండర్ అరెస్ట్ అని పోలీస్ అనడం.. బాబు ఎందుకని అడగ్గా.. నీ ఫ్యాన్స్ అంతా అక్కడ రచ్చ రచ్చ చేశారని చెబుతారు. ఆ తర్వాత అతడు టాయిలెట్ కు పోతుండగా.. ఓ రిపోర్టర్ పారిపోయిన బాబు అని చెబుతుంది. వెంటనే అతడు వచ్చి నేను పారిపోలేదే టాయిలెట్ కు వెళ్లానంటూ వివరిస్తాడు.
ఇదంతా చూస్తున్న శివాజి ముందుగా ముఖం మార్చుకుని కూర్చున్నాడు. మూతికి చేయి అడ్డు పెట్టుకుని చాలా ఆగ్రహంగా చూస్తున్నట్లు అనిపిచింది. కానీ స్కిట్ పూర్తి అయ్యాక అంటే చివర్లో మాత్రం ఆయన నవ్వుతున్నట్లు చూపించారు. అసలు ఈ వారం అంటే జనవరి 26వ తేదీ వచ్చే పూర్తి పిసోడ్ చూస్తే తప్ప ఆయన ఎలా రియాక్ట్ అయ్యారనేది క్లారిటీగా తెలిసేలా లేదు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











