Bigg Boss Telugu 7: ఫినాలే ముందు శివాజికి షాక్.. చివరి ఎపిసోడ్‌లో పరువు పాయే.. అతడికి పెరిగిన ఓటింగ్

ప్రతి భాషలోనూ బుల్లితెరకు పరిమితులు ఉంటాయి. వాటిని బ్రేక్ చేసేందుకు ఎన్నో రకాల షోలు వచ్చాయి. కానీ, అవేమీ సక్సెస్ కాలేదు. ఇలాంటి తరుణంలో విభిన్నమైన కంటెంట్‌తో వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న షోనే బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది సెన్సేషనల్ హిట్ అయింది.

దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని పూర్తి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్ శివాజి నోటి దురుసుతో పరువు పోగొట్టుకున్నాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

 Sivaji Shocking Words On Amardeep in Bigg Boss Telugu 7 Jyothishyam Task

వాటి కంటే ఎక్కువ సక్సెస్: బిగ్ బాస్ ఏడో సీజన్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలన్న లక్ష్యంతో ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో పరిచయం చేశారు. పేరుకు తగ్గట్లుగానే ఇందులో ఊహించని ఎన్నో అంశాలను చూపించారు. ముఖ్యంగా కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఇచ్చారు. ఫలితంగా ఈ సీజన్ గతంలో కంటే ఎక్కువ సక్సెస్ అయింది. అదే సమయంలో వినోదాన్ని కూడా పంచింది.

ఫినాలేలోకి ఆరుగురు రాక: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి చాలా మంది పేరున్న సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇలా మొదట 14 మంది, ఆ తర్వాత మరో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో గడిచిన 14 వారాల్లో 13 మంది షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఫలితంగా అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్, శివాజి, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ప్రిన్స్ యావర్‌లు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు.

హౌస్‌లో పాత టాస్కులతో: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17వ తేదీన జరగబోతుంది. దీంతో ఈ వారంలో కంటెస్టెంట్లకు సంబంధించిన జర్నీ వీడియోలను చూపించారు. ఆ తర్వాత ఏలియన్స్ వచ్చి కొన్ని పాత టాస్కులను ఇచ్చారు. వీటిలో గెలిచిన వాళ్లకు ఇంటి భోజనాలను కూడా అందించారు. ఇలా ప్రతి కంటెస్టెంట్ కనీసం టాస్క్ అయినా ఆడేలా ప్లాన్ చేసి వాళ్ల ఓటింగ్ పెరిగేలా చేశారు.

జ్యోతిష్యం టాస్క్‌తో ఫన్: బిగ్ బాస్ ఏడో సీజన్ చివరి వారంలో ఫన్ టాస్కులు కంటిన్యూ అవుతున్నాయి. ఇందులో భాగంగానే అమర్‌దీప్ చౌదరిని ఇంట్లోని మిగిలిన కంటెస్టెంట్లకు జ్యోతిష్యం చెప్పాలని టాస్క్ ఇచ్చారు. దీంతో అతడు తనలోని ఫన్ యాంగిల్‌ను బయటకు తీసుకు వచ్చి సరదాగా జాతకాలు చెప్పాడు. ఇందులో అమర్‌దీప్ చూపించిన టాలెంట్‌కు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు.

 Sivaji Shocking Words On Amardeep in Bigg Boss Telugu 7 Jyothishyam Task

అమర్‌దీప్‌ను వెధవ అని: బిగ్ బాస్ షోలో అమర్‌దీప్ చౌదరి - శివాజి మధ్య టామ్ అండ్ జెర్రీ సీన్స్ కనిపించాయి. కానీ, ఒక్కోసారి మాత్రం పెద్దాయన మాటలు శృతిమించడంతో నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ తాజా జ్యోతిష్యం టాస్కులో శివాజి పదే పదే అమర్‌దీప్ చౌదరిని వెధవ.. వెధవన్నర వెధవ అంటూ నోటి దురుసు చూపించాడు. అయినా అతడు మాత్రం ఫన్నీగా తీసుకున్నాడు.

కప్పుకు అర కిలో మీటర్: మొదట అమర్‌దీప్ అందరి జాతకాలు చెప్పిన తర్వాత శివాజిని అతడి జ్యోతిష్యం చెప్పమని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు మరింత రెచ్చిపోయిన అతడు 'ఈ వెధవ జాతకం మొత్తం బయటపెడతా. మనిషి మంచోడే గుణమే గుడిసేటిది. అడ్డదారులు ఎక్కువ. దీనివల్ల కప్పుకు అర కిలోమీటర్ దూరంలో ఉన్నావ్. రేయ్ వెధవా.. వెధవన్నార వెధవ ఇటు చూడరా' అన్నాడు.

పరువు పాయే.. ఓటింగ్‌లో: అమర్‌దీప్‌పై శివాజి చేసిన కామెంట్లు తీవ్ర స్థాయిలోనే ప్రభావాన్ని చూపించాయని చెప్పాలి. ముఖ్యంగా నోటి దురుసు కారణంగా శివాజి మరోసారి పరువు పోగొట్టుకున్నట్లు అయింది. అంతేకాదు, ఈ ఎపిసోడ్ తర్వాత అంటే చివరి గంట వ్యవధిలో ఓటింగ్‌లోనూ చాలా మార్పులు వచ్చినట్లు తెలిసింది. అమర్‌కు ఓటింగ్ భారీగా పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X