Bigg Boss Telugu 7: హౌస్‌లోకి కొత్త పర్సన్ ఎంట్రీ.. శివాజీకి బిగ్ సర్ ప్రైజ్.. టైటిల్ విన్నర్ అతనే అంటూ హింట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు 10వ వారంలోకి అడుగుపెట్టింది ఈ షో. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తన మైండ్ గేమ్ తో బిగ్ బాస్ హౌస్ లో ముందుకు వెళ్తున్నాడు. అయితే ఈ వారం ఆయనకు బిగ్ బాస్ బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. ఓ వ్యక్తి హౌస్ లోకి ఎంటర్ అవ్వడంతో.. శివాజీ ఎమోషల్ అయిపోయాడు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ షో చివరిదశకు వచ్చినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకుని... 10వ వారంలోకి అడుగుపెట్టింది ఈషో. ఇక హౌస్ లో ఉన్నది పది మంది మాత్రమే. ఇక మరో ఐదు వారాలు ఈ ఆట కొనసాగనుందని తెలుస్తోంది. శివాజీ, యావర్, ప్రశాంత్, శోభా శెట్టి, అమర్ దీప్, అర్జున్, గౌతమ్, రతికా రోజ్, ప్రియాంక, అశ్విని, బోలే హౌస్ లో ప్రస్తుతం ఉన్నారు.

అయితే శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన మొదట్లో ఫిజికల్ టాస్కులు కూడా బాగా ఆడాడు. అయితే ఫిజికల్ టాస్కుల్లో భాగంగా ఆయన చేతికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఇక కట్టుతో.. ఒంటి చేత్తోనే గేమ్ ను ముందుకు తీసుకువెళ్లాడు. అంతే కాదు.. ఆయన మైండ్ గేమ్ తో ఆటను ఆడుతూ వచ్చాడు. ఇక హౌస్ లో ఆయన గ్రూప్ లో ఇప్పటికే యావర్, ప్రశాంత్, బోలే, అశ్విని, రతక చేరిన సంగతి తెలిసిందే.
అయితే శివాజీకి బిగ్ బాస్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లైవ్ ఎపిసోడ్ చూసిన వారికి ఇది అర్థం అవుతుంది. శివాజీకి హ్యాండ్ బాగాలేదని ఓ డాక్టర్ ను పిలిపిస్తారు. ఇక శివాజికి ఆయన చెక్ చేసి అంతా సెట్ అయిపోయిందని చెప్తాడు. ఇక ఆ డాక్టర్ ఫేస్ మొత్తం కవర్ చేసి ఉంటుంది. ఇక శివాజీ వెళ్లే ముందు డాడ్ అంటూ పిలుస్తాడు. మాస్క్ తీసే సరికి శివాజీ కొడుకు వచ్చాడు అని తెలుస్తోంది.

ఇక శివాజీ కొడుకును సంతోషంతో ఆనంద బాష్పాలు పెట్టుకుంటాడు శివాజీ. తెగ ఎమోషనల్ అయిపోతాడు. నా కొడుకు వచ్చాడు అంటూ అందరికీ చెప్తాడు. హాగ్ చేసుకుని.. ఇంటిలోని సభ్యులకు పరిచయం చేస్తాడు. అయితే శివాజీ కొడుకు వెంకట్ అలియాస్ రిక్కి.. నేరుగా ప్రశాంత్ ను కలుస్తాడు. నా తండ్రిని బాగా చూసుతున్నావ్ అంటూ ఎమోషల్ అయిపోతాడు.
అంతే కాదు.. యావర్, ప్రశాంత్ ఇద్దరిని పట్టుకుని మీరే నా తండ్రిని.. మీ తండ్రి లాగా చూసుకున్నారు. బాగా చూసుకున్నారు.. థ్యాంక్స్ అన్నా అంటూ వారితో కలిసిపోతాడు రిక్కి. ఇక సీరియల్ బ్యాచ్ తో అంటి ముట్టనట్టుగానే ఉంటాడు. ఇక ప్రశాంత్ తో మల్లొచ్చిన అన్నా.. అంటూ మాట్లాడుతూ.. హౌస్ అంతా సందడి చేస్తాడు రిక్కి. ఇక రిక్కి.. ఈ సారి సీజన్ విన్నర్ ప్రశాంత్ అన్నట్లు హింట్ ఇస్తాడు. ఆయన మాట్లాడిన మాటలు విన్న ప్రేక్షకులు.. ఈ సారి విన్నర్ ప్రశాంత్ అని అర్థం అవుతుంది.

ఇక రిక్కి రాకతో శివాజీలో రెట్టింపు ఉత్సాహం మొదలు అయింది. ఇక అదే ఉత్సాహంతో ఆటను మరింత రంజుగా ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇక ఒక్క శివాజీకే కాదు.. అందరి ఇంటి సభ్యులకు సర్ ప్రైజస్ ఉన్నాయట. చూడాలి మరి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది శివాజీ, యావర్, బోలే, ప్రశాంత్, రతిక ఉన్నారు. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి.


Click it and Unblock the Notifications











