Bigg Boss Telugu 7: షోలో మరో పెను సంచలనం.. సీజన్ నుంచి శివాజి ఔట్.. బిగ్ బాస్ ప్రకటనతో షాక్
టెలివిజన్ హిస్టరీలోనే దేశ వ్యాప్తంగా సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన ఏకైక షోనే బిగ్ బాస్. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. అందుకే ఈ షో ప్రసారం అయిన ప్రతిసారీ ఆయా భాషల్లో నెంబర్ వన్ స్థానాన్ని స్థానంలో ఉంటోంది. ముఖ్యంగా తెలుగులో ఇది దేశంలోనే ఏ షోకూ రాని విధంగా రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న శివాజి షో నుంచి తప్పుకుంటున్నాడు. అసలేం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
ఉల్టా పుల్టాగా.. ఎన్నో ట్విస్ట్‌లు : ఏడో సీజన్‌ను ఎలాగైనా బిగ్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వహకులు దీన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో ప్రారంభించారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫస్ట్ డే నుంచే ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు. టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వంటి వాటిలో కొత్తదనం చూపించారు. ఇలా ఈ సీజన్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు.

వయసుకు తగ్గట్లుగానే శివాజి: ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురిని కూడా వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపించారు. అయితే, ఇందులో ఆరంభం నుంచే శివాజి టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు. ఆటతీరుతో పాటు బ్రెయిన్‌కు పని చెప్తూ సత్తా చాటుతున్నాడు. దీంతో క్రమంగా క్రేజ్ పెంచుకుంటోన్నాడు.

గాయంతో శివాజికి ఇబ్బంది : బిగ్ బాస్ షోలో ఒక వారంలో టాస్క్ జరుగుతున్న సమయంలో శివాజి కింద పడ్డాడు. దీంతో అతడి భుజానికి గాయం అయిన విషయం తెలిసిందే. అందుకే అతడిని స్కానింగ్ కోసం బయటకు పంపించి.. వైద్య పరీక్షల అనంతరం లోపలికి తీసుకు వచ్చారు. అప్పటి నుంచి బిగ్ బాస్ కూడా అతడిని టాస్కులకు దూరంగానే ఉంచుతున్నా.. తనదైన రీతిలో మెప్పిస్తూనే వెళ్తున్నాడు.

కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసి : ఏడో వారంలో శివాజిపై కంటెస్టెంట్లు వ్యతిరేకత వ్యక్త పరుస్తూనే ఉన్నారు. నామినేషన్స్ టాస్కులో గౌతమ్ కృష్ణ అతడిని ఆటగాడు కాదు.. కోచ్ అంటూ విమర్శిస్తూ నామినేట్ చేశాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శివాజిపై కొందరు కామెంట్లు చేశారు. తాజా ఎపిసోడ్‌లో అమర్‌దీప్ అయితే గేమ్ సరిగా ఆడలేదని చెప్తూ అతడిని కెప్టెన్సీ కంటెండర్ల రేసు నుంచి ఎలిమినేట్ చేసేశాడు.
బిగ్ బాస్‌కు చెప్పి ఏడుస్తూ : తనను కెప్టెన్సీ కంటెడర్ల రేసు నుంచి తప్పించడంతో శివాజి ఎంతగానో బాధపడ్డాడు. మైక్ తీసేసి మరీ 'నేను వెళ్లిపోతా బిగ్ బాస్. నన్ను పంపించు' అంటూ గొడవ చేశాడు. తర్వాత కన్‌ఫెషన్ రూమ్‌కు వెళ్లిన శివాజి ఏడుస్తూ తన బాధను బిగ్ బాస్‌తో పంచుకున్నాడు. అందరూ తనను అంటుంటే తట్టుకోలేకపోతున్నానని, వాళ్ల మాటల్లోనూ నిజం ఉందని ఎమోషనల్ అయ్యాడు.

చేయి లాగుతుంది అంటూ : హౌస్‌లోని కంటెస్టెంట్లు తనపై విమర్శలు చేయడం తట్టుకోలేకపోతున్నానని చెప్పిన శివాజి.. తన గాయం వల్లే సరిగా ఆడలేకపోతున్నానని స్పష్టం చేశాడు. అంతేకాదు, బిగ్ బాస్ అడగడంతో 'నా చేయి బాగా లాగుతుంది. పైకి నవ్వుతున్నా లోపల ఏడుస్తున్నా. అలా ఉండడం నటించినట్లే అవుతుంది. కాబట్టి దయచేసి నన్ను బయటకు పంపించేయండి' అని శివాజి రిక్వెస్ట్ చేశాడు.
శివాజికి ఓకే చెప్పిన బాస్ : ఆ తర్వాత శివాజి 'నిజంగా నేను ఇక్కడికి గెలవడానికే వచ్చాను. ఉంటే కచ్చితంగా గెలిచే వెళ్తాను. కానీ, ఆ గాయం నాకు సహకరించడం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి బిగ్ బాస్ 'శివాజి.. మీకు మరోసారి డాకర్లు వైద్య పరీక్షలు చేస్తారు. వాళ్లు మీ పరిస్థితిపై అవగాహనకు వచ్చి పంపించమంటే.. మిమ్మల్ని హౌస్ నుంచి పంపిస్తాము' అని ప్రకటించాడు. దీంతో శివాజి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నిజంగానే అతడు బయటకు వస్తాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











