Bigg Boss Telugu 7: శివాజి మైండ్ గేమ్ మామమూలుగా లేదుగా.. యావర్, రతికలను ఎలిమినేట్ చేయమంటూ సూచన!
Sivaji Mind Game: బిగ్ బాస్ తెలుగు 7 షో రోజురోజుకూ రంజుగా సాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల వల్ల షో మరింత అద్భుతంగా సాగుతుండగా.. కంటెస్టెంట్లు చేసే రచ్చ మామూలుగా ఉండట్లేదు. చిన్న చిన్న గేమ్ లకే పెద్ద పెద్ద గొడవలు పడుతున్నారు. ముఖ్యం కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం ఒక్కొక్కరూ చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా చాలా బాగా కలిసి ఉండే వాళ్ల మధ్య కూడా విపరీతమైన గొడవలు చెలరేగుతున్నాయి. అలాగే గొడవ పడే వాళ్ల మధ్య ప్రేమానుబంధాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శివాజి తన శిష్యులపైనే ఫైర్ అయ్యారే.
మొదటి వారం నుంచే శివాజి.. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లకు ఫేవర్ గా ఉంటున్నాడు. వారు చేసే తప్పులు చెబుతూ.. వారిని గెలిపించేందుకు ట్రై చేస్తున్నాడు. ముఖ్యంగా వారికి సపోర్ట్ చేస్తూ తన గేమ్ తాను ఆడుతున్నాడు. ఫెయిర్ గా గేమ్ ఆడుతూ.. నోరు జారకూడదని వివరిస్తున్నాడు. అయితే గతంలో ఇంట్లోకి వచ్చి ఎలిమినేట్ అయిన రతికా రోజ్.. మళ్లీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రతికా రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శివాజి, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్.. వీరికి ఫేవర్ గా ఉంటున్న భోలె షవాళితో చక్కటి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తుంది.

ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతికలు.. శివాజికి శిష్యులుగా మారారు. ప్రస్తుతం కంటెండర్ షిప్ కోసం సాగుతున్న గేమ్ లో వీరి మధ్య గొడవలు వచ్చాయి. ఇప్పటికే గేమ్ నుంచి ఔట్ అయిపోయిన్ పల్లవి ప్రశాంత్ పక్కనే ఉంటుండగా.. రతికా రోజ్, ప్రిన్స్ యావర్ శివాజికి అపోజిట్ టీంలో ఉన్నారు. అయితే బాల్స్ కాపాడుకోవాల్సిన ఈ గేమ్ లో రాత్రి ఎదుటి వాళ్ల టీం నుంచి బాల్స్ లాక్కుంటామని చెప్పారు. అయితే మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన శివాజి ముందుగా గౌతమ్ కృష్ణపై ఫైర్ అయ్యాడు. అలా బాల్స్ లాక్కోవడం సరైన పద్దతి కాదని సూచించాడు.
అలా చేస్తే మీరే పబ్లిక్ లో నెగిటివ్ అవుతారంటూ వివరించే ప్రయత్నం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అలా చేయకూడదని హెచ్చరించాడు. ఈక్రమంలోనే తప్పుడుగా గేమ్ ఆడి, తెలియకుండా బాల్స్ లాక్కున్న వాళ్లను ఎలిమినేట్ చేయమని శివాజి బిగ్ బాస్ కు సూచించాడు. రాత్రి ఒకసారి శివాజి ఇలా కామెంట్లు చేయగా.. మరుసటి రోజు ఉదయం కూడా మళ్లీ ఇలాగే మాట్లాడాడు. రతికా, ప్రిన్స్ యావర్లు కూడా బాల్స్ లాక్కుంటామని అనగా.. ఇలా చేసే వాళ్లను ఎలిమినేట్ చేయండి సార్ అంటూ శివాజి అన్నాడు.

అయితే తమతో ఎంతో చక్కగా ఉండే శివాజియే తమను ఎలిమినేట్ చేయమంటూ అనేసరికి ప్రిన్స్ యావర్ ఫుల్ ఫీల్ అయ్యాడు. శివాజి సార్ అలా అనడం నాకు అస్సలే నచ్చలేదని రతికా రోజ్ తో చెబుతూ బాధ పడ్డాడు. రతిక కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అని చెప్పగా... ఇదేం వార్ కాదని శివాజి అంటాడు. ఇలా అత్యద్భుతంగా ఈ గేమ్ సాగుతుండగా.. ఎవరు కెప్టెన్ అవుతారో ఈరోజుటి ఎపిసోడ్ తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











