Bigg Boss 7 Telugu: తేలిపోయిన బిగ్ బాస్ విన్నర్.. ఆ లెక్కలే చెప్తున్నాయిగా!
క్లిష్ట పరిస్థితుల మధ్యన తెలుగులోకి పరిచయమైనా.. ఎవరూ ఊహించని రీతిలో ఆరంభంలోనే మంచి స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో.. తెలుగులో మాత్రమే రికార్డు స్థాయి రేటింగ్‌ను అందుకుంటోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో సీజన్‌ను కూడా మొదలు పెట్టారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్‌ను డిసైడ్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే...
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 20 మందికి పైగానే కంటెస్టెంట్లు వస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఇది ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఎవరూ ఊహకూ అందని విధంగా 14 మందిని మాత్రమే తీసుకు వచ్చారు. అయితే, ఇందులో ఎవరూ కన్ఫార్మ్ అయిన కంటెస్టెంట్ కాదని చెప్పారు. ప్రతి వారం జరిగే టాస్కుల్లో గెలిచి పవర్ అస్త్రాన్ని గెలిస్తేనే కంటెస్టెంట్ అవుతారని మెలిక పెట్టారు.

మొదటి వారానికి గానూ జరిగిన పవర్ అస్త్ర టాస్కులో సందీప్ మాస్టర్ విజయం సాధించి మొదటి కన్ఫార్మ్‌డ్ కంటెస్టెంట్ అయ్యాడు. ఇక, రెండో వారానికి సంబంధించి హౌస్‌లో ఉన్న సభ్యులకు రకరకాల టాస్కులను ఇచ్చారు. ముఖ్యంగా చివరి దశకు చేరుకున్న శివాజి, షకీలా, అమర్‌దీప్ చౌదరిలకు 'షౌటింగ్' (గట్టిగా అరవడం) టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే.
'షౌటింగ్' (గట్టిగా అరవడం) టాస్కులో భాగంగా ముగ్గురు పోటీదారులు బిగ్ బాస్ తమ పేరును పిలిచినప్పుడు చెవి ఆకారంలో ఉన్న బొమ్మ దగ్గర 'బిగ్ బాస్' అని అరవాలని చెప్పాడు. దీంతో శివాజి, షకీలా, అమర్‌దీప్‌లు తమ శక్తి మేర గట్టిగా అరిచారు. ఈ టాస్కులో విజేత ఎవరు అనేది శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున స్వయంగా ప్రకటించాడు.
ముగ్గురు పోటీదారులు అరిచినప్పుడు డెసిబెల్స్ ఎవరికి ఎక్కువగా వస్తాయో వాళ్లే ఇందులో విజేత అని ముందే చెప్పారు. ఇక, ఈ టాస్కులో అమర్‌దీప్ చౌదరికి -6 పాయింట్లు నమోదు అయ్యాయి. తర్వాత షకీలాకు +9 పాయిట్లు, శివాజికి అందరి కంటే ఎక్కువగా +11 పాయింట్లు వచ్చాయి. దీంతో ఈ టాస్కులో ఈ సీనియర్ హీరోనే విజయం సాధించి పవర్ అస్త్రాన్ని గెలిచాడు.
డెసిబెల్స్ ఎలా ఎక్కువ తెప్పించుకోవాలి అన్న దానిపై శివాజికి మాత్రమే అవగాహన ఉందన్న విషయం ఆ తర్వాత అతడి మాటలను బట్టి అర్థం అయింది. మైక్‌కు బాగా దగ్గరగా కానీ, దూరంగా కానీ ఉండకుండా ఉంటేనే సౌండ్ అనుకున్న విధంగా వెళ్తుందట. అదే లెక్కలు వేసుకుని ఈ టాస్కులో శివాజి గెలిచాడు.
ఈ టాస్కులో తాను చూపెట్టిన శ్రమ వెనుక ఉన్న మైండ్‌గేమ్‌ను శివాజి చెప్పడంతో నాగార్జున కూడా అంగీకరించాడు. ఇక, షకీలా బాగా దగ్గరగా పెట్టి అరవడం వల్ల ఆమెకు తక్కువ పాయింట్లు వచ్చాయని కింగ్ చెప్పాడు. అమర్‌దీప్ సాగదీయడం వల్ల మధ్యలో కాస్త పాజ్ వచ్చి మైనస్ పాయింట్లు వచ్చాయని తెలిపాడు. మొత్తానికి శివాజి ఇదే మైండ్ గేమ్ కంటిన్యూ చేస్తే ఈ సీజన్‌లో విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











