Bigg Boss Nominations: 4వ వారం నామినేషన్స్ లీక్.. ఆ ఆరుగురు బలి..ఆమెను సేవ్ చేసిన నిఖిల్
దేశ వ్యాప్తంగా బుల్లితెర చరిత్రలోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగానే అందుతోంది. అందుకే ఈ షో ప్రసారం అయిన ప్రతిసారీ ఆయా భాషల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటోంది. ముఖ్యంగా తెలుగులో ఇది దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను నడుపుతున్నారు. మరో డిఫరెంట్ కాన్సెప్టుతో నడుస్తోన్న ఈ సీజన్‌కు సంబంధించిన నాలుగో వారంలో నామినేషన్స్ వివరాలు లీకయ్యాయి. ఆ సంగతులు మీకోసమే!
కొత్త కంటెంట్‌తో ఎనిమిదోది
బిగ్ బాస్ నుంచి ఎనిమిదో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే దీన్ని అన్‌లిమిటెడ్ అనే కాన్సెప్టుతో మొదలు పెట్టారు. ఇందులో ఆరంభం నుంచే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాస్కుల్లో వైవిధ్యం చూపిస్తున్నారు. దీంతో ఎంతో గొడవలు జరుగుతూ ఈ సీజన్ రంజుగా మారిపోతోంది.

14 మందిలో ముగ్గురు ఔట్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి వారంలో బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా, మూడో వారంలో అభయ్ ఎలిమినేట్ అయ్యారు.
నామినేషన్స్‌పై ఆసక్తిగానే
బిగ్ బాస్ హౌస్‌లో గత వారంలో 'ప్రభావతి 2.O' టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గుడ్ల కోసం కంటెస్టెంట్లు ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు. ఈ సీజన్ మొత్తంలో ఇందులోనే పెద్ద గొడవలు జరిగాయి. ఫలితంగా శనివారం ఎపిసోడ్‌లో సైతం నాగార్జున చాలా మందికి క్లాస్ పీకాడు. దీంతో ఇప్పుడు నాలుగో వారం జరిగే నామినేషన్స్‌పై అందరిలోనూ ఆసక్తి బాగా కనిపిస్తోంది.
క్రీమ్ కొట్టే టాస్క్‌తో రచ్చ
బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను పాత పద్దతిలోనే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హౌస్‌లో ఉన్న చీఫ్ నిఖిల్ తప్ప మిగిలిన వాళ్లందరినీ నామినేట్ చేసుకోవచ్చు. ఈ టాస్క్‌లో భాగంగా నామినేట్ చేసే కంటెస్టెంట్ల ముఖంపై స్ప్రే కొట్టి అందుకు తగిన కారణాలను వెల్లడించాలి.
ఆ ఆరుగురు నామినేషన్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోని నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. తాజాగా బయటకు వచ్చేసిన సమాచారం ప్రకారం.. ఇందులో ఆరుగురు మాత్రమే నామినేట్ అయ్యారు. వారిలో ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టి, నాగ మణికంఠ, ఆదిత్యం ఓం, నబీల్, సోనియా ఆకులలు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చినట్లు తాజాగా న్యూస్ లీక్ అయింది.
ఆమెను సేఫ్ చేసిన చీఫ్
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్‌లో చీఫ్‌లకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నారు. అలా ఇప్పుడు ఒకరిని సేవ్ చేసే అధికారాన్ని బిగ్ బాస్ నిఖిల్‌కు ఇచ్చాడని తెలిసింది. దీంతో అతడు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న నైనికను తప్పించాడు. దీంతో ఆమె నామినేషన్ నుంచి బయటపడింది.


Click it and Unblock the Notifications











