సంపూర్ణేష్ బాబు, బిగ్ బాస్ భానుశ్రీ మధ్య ముద్దు గొడవ...
Recommended Video

బుల్లితెరపై ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన షో 'సిక్త్స్ సెన్స్'...ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ టీవీషో ప్రస్తుతం సెకండ్ సీజన్ రన్ అవుతోంది. అయితే ఈ వారం షో మరింత రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్ బాస్2 ఫేం భానుశ్రీ, సంపూర్ణేష్ బాబు మధ్య షోలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
అంతే కాదు... అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని భానుశ్రీ హాట్ హాట్ లుక్‌తో దర్శమిచ్చి అభిమానుల మతిపోట్టింది. స్వింగ్ జరా సాంగుకు డాన్స్ చేస్తూ అలరించింది. ఈ వారం ప్రసారం అయ్యే షోకు సంబంధించి ప్రోమో విడుదల కాగానే అంచనాలు మరింత పెరిగాయి.

అందం, పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన భానుశ్రీ
తన అందం, పెర్ఫార్మెన్స్‌తో బిగ్ బాస్ ఫేం భానుశ్రీ ‘సిక్త్స్ సెన్స్' షోలో అదరగొట్టింది. చిట్టి పొట్టి గౌనులో హాట్ హాట్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తన ఔట్ స్టాండింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపింది.

అప్పారావు, రైజింగ్ రాజు కామెడీ అదుర్స్
బాంబు చుట్టింది మా తాత, బాంబు కనిపెట్టింది మా ముత్తాత అంటూ..... జబర్దస్త్ కమెడియన్స్ అప్పారావు, రైజింగ్ రాజు మధ్య జరిగే సంభాషణ తెగ నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంంది.

సంపూ డాన్స్
అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా వంపకే..... అంటూ సంపూర్ణేష్ బాబు చేసే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ వారం ప్రేక్షకులను మరింత ఎంటర్టెన్ చేయబోతోంది.
సంపూకు ముద్దు పెట్టనంటూ భానుశ్రీ గొడవ
సంపూర్ణేష్ బాబుకు ముద్దు పెట్టాలని షో హోస్ట్ చేస్తున్న ఓంకార్ అడగ్గా... అందుకు భానుశ్రీ నో చెప్పింది. షారుక్ ఖాన్ లేదా సల్మాన్ ఖాన్ అయితే పెడతాను, సంపూ లాంటి వారికి పెట్టను అని చెప్పడంతో సంపూర్ణేష్ ఆమెతో గొడవపడటం తప్పకుండా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











