Bigg Boss 7 Telugu: కొత్త జంట మధ్య చిచ్చు.. ముఖం మీదే అలా అడగడంతో!

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై కొత్త రకాల కంటెంట్‌లతో ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. భారీ స్పందనను అందుకుంటూ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోన్న ఈ షో తాజాగా ఏడో దానితో వచ్చింది.

తెలుగులో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్‌ షో ఏడో సీజన్ గత ఆదివారమే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. దీనికి తగ్గట్లుగానే దీన్ని ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కంటెంట్, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో నడుపుతూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నారు. ప్రీమియర్ ఎపిసోడ్‌ నుంచి ఈ షో ఏ రేంజ్‌లో ఉండబోతుంది అనేది స్పష్టంగా చూపించారు. ఫలితంగా ఇది రంజుగా సాగబోతుంది.

Small Fight Between Gautham Krishna and Subhashree In Bigg Boss Show

బిగ్ బాస్ షోలో ప్రేమ జంటలు ఏ రేంజ్‌లో హైలైట్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి సీజన్‌లోనూ కొన్ని జోడీలు ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌లో సైతం గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురును ఓ ప్రేమ జంటగా మార్చే ప్రయత్నం జరుగుతోన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రీమియర్ ఎపిసోడ్‌లో నాగార్జున ఇచ్చిన టాస్కు ప్రకారం.. గౌతమ్ కృష్ణ, శుభశ్రీని అందంగా ఉన్నావని పొగడడంతో పాటు తన చేతికి ఉన్న సంకెళ్లు కూడా ఆమెకు తగిలించాడు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య బంధం మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా గౌతమ్ ఆమె పట్ల మరింత ప్రేమను చూపిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇదే విషయాన్ని తాజా ఎపిసోడ్‌లో షకీలా సైతం చెప్పింది.

Small Fight Between Gautham Krishna and Subhashree In Bigg Boss Show

ఇప్పటి వరకూ సాగిన ఎపిసోడ్లలో చూపించిన సీన్స్ ప్రకారం.. గౌతమ్ కృష్ణ - శుభశ్రీ రాయగురు మధ్య బంధం మరింత స్ట్రాంగ్‌గా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా వీళ్ల రిలేషన్‌కు ఆదిలోనే బ్రేక్ పడింది. ఈ విషయం తాజా ప్రోమోలో చూపించారు. ఇందులో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు కూడా చూపించారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.

తాజా ప్రోమోలో శుభశ్రీ.. తేజతో కలిసి డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత గౌతమ్ ఆమెను పిలిచి 'డ్యాన్స్ వేసేటప్పుడు ఇద్దరికీ ప్రాబ్లం లేదు కదా' అంటూ తనను అగౌరపరిచావని అన్నాడు. దీనికామె 'నేనేమీ నిన్ను అగౌరపరచలేదు' అంది. తర్వాత ఇదే విషయంపై ఇద్దరి మధ్య చర్చ జరగ్గా 'నేను దూరంగా ఉండమంటే ఉంటా' అన్నాడు. దీనికామె 'అది నీ ఇష్టం' అంది. దీంతో గౌతమ్ బాధగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X