2020లో బుల్లితెరదే హవా.. వెలవెలబోయిన వెండితెర

2020 ఏడాది ముగిసేందుకు వచ్చింది. మొత్తానికి ఈ ఏడాదిలో వెండితెర మాత్రం వెలవెలబోయింది. మొదటి రెండు మూడు నెలలు బాగానే కలిసిసొచ్చినట్టుగా సినిమాలు హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ కళకళలాడుతూ వచ్చింది. కానీ మార్చిలో కరోనా ఉధృతి పెరగడం, లాక్డౌన్ విధించడంతో అంతా తారుమారైంది. మార్చిలో మూత బడిని థియేటర్లకు ఇప్పటి వరకు మోక్షం కలగలేదు. ఇన్ని నెలల తరువాత ఈ రోజు టాలీవుడ్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ థియేటర్లలో సందడి కనిపిస్తోంది.

కానీ మార్చి నుంచి మాత్రం బుల్లితెర తన హవాను కొనసాగించింది. లాక్డౌన్ సమయంలో బుల్లితెర వీక్షకుల సంఖ్య రెట్టింపైంది. మామూలుగా చూసే సంఖ్య కంటే రెండు మూడు రెట్లు ఎక్కువయ్యారట. టీఆర్పీల్లో బుల్లితెర ఈ ఏడాది కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. లాక్డౌన్‌కు జనాలు అలవాటు పడాలని పాత ధారావాహికలను కూడా ప్రసారం చేయించింది ప్రభుత్వం. నాటి మహాకావ్యాలైన రామాయణ, మహాభారతాలను పున: ప్రసారం చేయించింది.

Small Screen TRP Highest In 2020 Year

అంతే కాకుండా పాత చిత్రాలు, నాటి క్లాసిక్ మూవీలను వేస్తూ జనాలను బుల్లితెర అతుక్కుపోయేలా చేశారు. మొత్తానికి జనాలకు లాక్డౌన్ సమయంలో ఓటీటీ లేదా బుల్లితెర మాత్రమే దిక్కుగా తోచింది. అందుకే అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక బుల్లితెర పరిశ్రమ సందడి జోరందుకుంది. సినిమా రేంజ్‌లకు తగ్గట్టుగా పండుగలకు స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేశారు. మొత్తానికి ఈ ఏడాదిలో 75 శాతం బుల్లితెర హవానే కొనసాగిందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X