సృతి ఇరానీ బిడ్డకు చేదు అనుభవం: అందగత్తే కాదు ఫైటర్... పిచ్చిగా వ్యవహరిస్తే తాటతీస్తది!
బుల్లి తెర నటి నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ కూడా అభద్రతాభావానికి తలవొగ్గక తప్పలేదు. తన కూతురు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నారు. కొద్ది రోజుల క్రితం లిమ్కా బుక్ రికార్డుల్లోకి చేరిన తన కూతురుతో సెల్ఫీ దిగి ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ తర్వాత తన కూతురుకు ఇబ్బంది కలుగడంతో ఆ ఫోటోను డిలీట్ చేసి ఓ ఎమోషనల్ పోస్టును పెట్టారు. అసలు ఏం జరిగిందంటే..

కూతురితో సెల్ఫీ
తన కూతురుతో దిగిన సెల్ఫీపై సృతీ ఇరానీ స్పందిస్తూ.. నేను పోస్ట్ చేసిన సెల్ఫీ ఫోటో తన కూతురు జోయిష్ ఇరానీకి ఇబ్బంది పెట్టింది. స్కూల్‌లో కొందరు స్నేహితులందరూ ఆటపట్టించడం, మరి కొందరు టీజింగ్ చేయడంతో జోయిష్ కంగారు పడింది. ఝా అనే క్లాస్ మేట్ ఏడ్పించాడు. దాంతో తనకు జరిగిన ఇబ్బందిని పంచుకొని కంటతడి పెట్టింది. దాంతో ఆ సెల్ఫీ ఫోటోను డిలీట్ చేశాను అని సృతి ఇరానీ మీడియాకు వెల్లడించారు.

కరాటేలో బ్లాక్ బెల్ట్..
తన కూతురుకు సంబంధించిన విషయాన్ని ఇన్స్‌టాగ్రామ్‌లో స్మృతి ఇరానీ వెల్లడించారు. నా కూతురు మంచి క్రీడాకారిణి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకొన్నది. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. ప్రపంచ కరాటే ఛాంపియన్ షిప్స్‌లో కాంస్య పతకాలు కూడా సాధించింది అని సృతి ఇరానీ పేర్కొన్నది.

పిచ్చిగా వ్యవహరిస్తే అంతే
అంతేకాకుండా నా కూతురు జోయిష్ చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే ఆమె కరాటే ఫైటర్ అనే విషయాన్ని మరిచిపోవద్దు. తుంటరి, పోకిరి వెధవలకు గట్టిగా సమాధానం ఇస్తుంది. తాట తీయడానికి కూడా వెనుకాడదు. ఆమె కళ్లలో నీళ్లు చూడకూడదనే సెల్ఫీ ఫొటోను ఇన్స్‌టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాను అని సృతి ఇరానీ ఇన్స్‌టాగ్రామ్‌లో చెప్పింది.

సృతి బిడ్డకు నెటిజన్ల మద్దతు
ఇన్స్‌టాగ్రామ్‌లో సృతీ ఇరానీ పోస్టుకు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. నిన్ను ఎవరైనా వేధిస్తే అది వారి బలహీనత. వారిలో ఉండే బలహీనతను నుంచి బయటపడటానికి గెట్ వెల్ సూన్ అని చెప్పండి. ఝా లాంటి వ్యక్తులను పట్టించుకోకు. అలాంటి వాళ్లకు ఓ చెంపదెబ్బ సరైన జవాబు అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.


Click it and Unblock the Notifications











