మీ ప్రయోజనాల కోసం నన్ను వాడుకోవద్దు.. శోభితా ధూళిపాల సీరియస్
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ప్రారంభానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నానే వార్త ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ రియాలిటీ షో గురించి మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తెలుగు బిగ్‌బాస్ షో గురించి హీరోయిన్ శోభితా ధూళిపాళ తీవ్రంగా స్పందించారు.

హీరోయిన్ శోభిత ధూళిపాల తెలుగు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నారంటూ కొద్ది రోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్తపై నేరుగా ట్విట్టర్‌లో స్పందించారు. తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ స్వప్రయోజనాల కోసం నా పేరు వాడుకోవద్దు అని ట్వీట్ చేశారు. ఒక్క ట్వీట్‌తో గాసిప్స్ తెర దించేసారు శోభిత.

తెలుగు బిగ్‌బాస్‌లో సెలబ్రిటీ జాబితా మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీముఖి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ రఘు, గాయకులు కృష్ణ చైతన్య,హేమచంద్ర, రేవంత్, గుత్తా జ్వాలా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే షో ప్రారంభమైతే గానీ అసలు సెలబ్రిటీలు ఎవరో తెలియదు. ఎందుకంటే బిగ్‌బాస్ కార్యక్రమం అంతా సీక్రెట్‌గా, ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుందనే అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











