అమాయకురాలిని కాదు అంటూ దీప్తి పోస్ట్.. వీడియో పోస్ట్ చేసి మరీ షణ్ముఖ్ కౌంటర్?
బిగ్‌బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ ముందు చాలా క్రేజ్ తో హౌస్ లో అడుగు పెట్టాడు. కానీ సిరితో స్నేహం సహా అనేక కారణాలతో ఆయన చాలా నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. అతని ప్రియురాలు కూడా బ్రేకప్ చెప్పింది. అయితే ఇప్పటిదాకా ఈ విషయం మీద ఒక్కసారి స్పందించిన షణ్ముఖ్ ఇప్పుడు ఆమెకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చే విధంగా వీడియో షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

టైటిల్ ఫేవరెట్ గా
బిగ్ బాస్ సీజన్ 5 లో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన యూట్యూబర్, షార్ట్ ఫిలిం లీడ్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఆరేడు వారాలు కేవలం మోజ్ రూమ్ కే పరిమితమై టాస్క్ లలో చాలా వీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. షో నదించినంత సేపు కూర్చుని ఉండడానికి ఆసక్తి చూపిన షన్ను తన చేతకాని తనాన్ని జెస్సి, సిరి ల ఫ్రెండ్ షిప్ మీద నెట్టేవాడు. బయట నుంచి వచ్చేటప్పటికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా విన్నర్ గా బిగ్ బాస్ సీజన్ 5 ట్రోఫీ వచ్చేస్తుంది అనుకున్నాడు.

బ్రేకప్ చెప్పి
అయితే అనూహ్యంగా ఆట చివరికి వచ్చేసరికి షణ్ముఖ్ జస్వంత్ కి ఫ్యాన్స్ కూడా షాకిచ్చారు. షణ్ముఖ్ సిరి తో చేసే ఓవరాక్షన్ భరించలేక బుల్లితెర ప్రేక్షకులయితే ఎప్పుడు హౌస్ నుంచి వెళ్ళిపోతాడు అని ఎదురు చూశారు. టాస్క్ ల పరంగా వీక్ గా ఉండడం, సిరితో అతి ఫ్రెండ్ షిప్, సహా వేరే కంటెస్టెంట్స్ తో కలవకపోవడంతో అప్పటి దాకా షణ్ముఖ్ కి ఉన్న క్రేజ్ మొత్తం పడిపోయింది. ఇక సిరితో హగ్గులు, కిస్ లు మాములుగా లేకపోవడంతో గర్ల్ ఫ్రెండ్ కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందనే.

మై లవ్ ఈజ్ గాన్
బ్రేకప్ చెప్పుకున్న వీరి మధ్య ఒకరకంగా సోషల్ మీడియా కోల్డ్ వార్ నడుస్తుంది. దీప్తి, షణ్ముఖ్ సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తాజాగా షణ్ముఖ్ ఓ డాన్స్ వీడియో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలోని 'మై లవ్ ఈజ్ గాన్' పాటకు షణ్ముఖ్ తన డ్యాన్స్ మాస్టర్ తో కలిసి స్టెప్స్ వేసి ఆకట్టుకున్నాడు.
Recommended Video

మై లవ్ ఈజ్ గాన్
ఇక షణ్ముఖ్ ధరించిన టీ షర్ట్ పై హార్ట్ సింబల్ కూడా ఉంది. ఈ సాంగ్ ఉద్దేశపూర్వకంగానే దీప్తికి కౌంటర్ లాగా షణ్ముఖ్ చేశాడని నెటిజెన్స్ భావిస్తున్నారు. ఇక దీప్తి షణ్ముఖ్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తోంది. షణ్ముఖ్ ని టార్గెట్ చేస్తూ ఆమె కొటేషన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె నాకు మనుషుల్ని అర్ధం చేసుకునే గుణం ఉంది, అలాగని మోసాన్ని కనిపెట్టలేని అమాయకురాలిని కాదు' అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేసింది. ఈ కామెంట్ షణ్ముఖ్ ని ఉద్దేశించే అని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు షన్ను దానికి కౌంటర్ గానే వీడియో చేశాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











