Bigg Boss7 లోకి నయని పావని ఎంట్రీ... సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక అప్పటి నుంచి ప్రేక్షకులకు షాక్ లు, ట్విస్టులు ఇస్తూ.. బిగ్ బాస్ షో ఎంటర్ టైన్ చేస్తూ వస్తుంది. ఇక తాజాగా బిగ్ బాస్ 2.ఓ గ్రాండ్ గా అక్టోంబర్ 8వ తేదీన గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన భామల్లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, టిక్ టాక్ స్టార్ నయని పావని ఒకరు. అసలు పాతికేళ్ల ఈ హాట్ బ్యూటీ ఎవరు..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఏ సినిమాల్లో నటించింది..? ఆమె బయోగ్రఫి ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 ఊహకు అందకుండా ఈ సారి రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఫీల్ తో పాటు.. షాక్ లు, ట్విస్టులు ఇస్తూ అలరిస్తూ వస్తోంది. ఈ సీజన్ లో 14 మంది ఎంటర్ అయ్యారు. ఇక అక్టోబర్ 8న బిగ్ బాస్ 2.ఓ అంటూ లాంచ్ చేశారు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామల్లో నయని పావని ఒకరు. రావడంతోనే అందరి దృష్టిన ఈ నయని పావని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Social Media Influencer Nayani Pavani into Bigg Boss 7 Telugu 2.O show

నయని పావని అలియస్ సాయి రాజు పావని.. టిక్ టాక్ స్టార్. అంతే కాదు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు బిగ్ బాస్ 2.ఓ ద్వారా ఈ భామ హౌజ్ లోకి అడుగుపెట్టింది. రావడం రావడమే ఈ భామ అందరినీ ఆకట్టుకుంది.

నయని పావని తెలంగాణ వాసి. 1998 ఆగస్టు 4న ఈ భామ హైదరాబాద్ లో జన్మించింది. సినిమాలపై మక్కువపై సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఇక అనేక కవర్ సాంగ్స్‌ తో పాటు.. ఎంత ఘాటు ప్రేమ, కేరాఫ్ అనకాపల్లి పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ vs సుబ్బులు వంటి షార్ట్ ఫిల్స్మ్‌ లో నటించింది. ఈటీవీలో ప్రసారం అయిన ఢీ డాన్స్ షోలోనూ తన టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు చూపించింది.

Social Media Influencer Nayani Pavani into Bigg Boss 7 Telugu 2.O show

సోషల్ మీడియా వాడే వారికి ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టిక్ టాక్ వీడియోల్లో కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌ తో పావని ఆకట్టుకుంటుంది. అంతే కాదు.. ఆమెకు సోషల్ మీడియాలో 674K వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఫోటోకానీ, వీడియో కానీ పెడితే వేలల్లో కామెంట్స్, లైక్స్ వస్తాయి. అంతలా ఈ బ్యూటీ నెటిజన్లను ఆకట్టుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

చూడటానికి హాట్ గా ఉన్న నయని పావని బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. ఇక ఈ భామతో బిగ్ బాస్ ఏ లవ్ ట్రాక్ వేస్తాడో వేచి చూడాల్సిందే. ఇక హౌజ్ లో ఇప్పటికే కండల వీరులు ఉన్నారు. వారితో ఈ భామకు లవ్ ట్రాక్ సెట్ అయితే.. మళ్లీ హౌజ్ లో ఎంటర్ టైన్మెంట్ మామూలుగా ఉండదని నెటిజన్స్ అంటున్నారు. ఈ భామ రెండు సినిమాల్లో కూడా నటించింది. సూర్యకాంతం, నీ జతగా అనే సినిమాల్లో ఈ భామ క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఎట్టకేలకు బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన నయని పావని తెలుగు ఫిల్మీబీట్ నుంచి ఆల్ ది బెస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X