Jabardasth లో సోషల్ మీడియా బంగారం.. హైపర్ ఆదితో కలిసి.. ఛీ పోరా అంటూ!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొంతమందికి ఊహించిన విధంగా అవకాశాలు వస్తున్నాయి. మొదట వారిని బాగా ట్రోల్ చేయడం కూడా బాగానే కలిసి వస్తోంది. ఇక అలా ట్రోలింగ్ బారిన పడినవారు మొదట కొంత ఇబ్బందులు పడినప్పటికీ ఆ తర్వాత పలు రియాలిటీ షోలలో కూడా అవకాశాలు అందుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ బంగారం జబర్దస్త్ లోకి అడుగుపెట్టడం మరింత వైరల్ గా మారుతొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్రాక్ లోకి జబర్దస్త్
టెలివిజన్ కామెడీ షోలలో మంచి టీఆర్పీ రేటింగ్ అందుకుంటున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఆ షోకు ఆదరణ తగ్గింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ మళ్ళీ కొంతమంది సీనియర్ కమెడియన్లు రీ ఎంట్రీ ఇచ్చి ట్రాక్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొత్త వారికి కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో..
ఎన్నో కాంట్రవర్సీ విషయాలపై కూడా జబర్దస్త్ లో నిత్యం పంచ్ లు వినబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హైపర్ ఆది సోషల్ మీడియాలో వైరల్ అయిన మీమ్స్ ను కూడా ఆధారంగా చేసుకుని స్కిట్ చేస్తూ ఉండడం అందరికీ తెలిసిందే. అలాగే యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన వారిని అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ద్వారా కూడా క్రేజ్ అందుకున్న వారిని జబర్దస్త్ లోకి రప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

బంగారం కూడా
ఇక ఇటీవల కాలంలో బంగారం అనే పేరుతో ఎక్కువగా వైరల్ అయిన శాంతి అనే అమ్మాయి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చీ పోరా! అంటూ ఆమెకు సంబంధించిన డైలాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. బంగారం.. చాలామంది అడుగుతున్నారు.. నీ బంగారం ఎవరని.. ఏమని సమాధానం చెప్పను. నువ్వు దూరమయ్యావని చెప్పనా.. నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పనా.. అంటూ కంటతడి పెట్టుకుంటూ ఆమె ఇచ్చిన పెర్ఫామెన్స్ బాగా వైరల్ అయింది.

టాప్ కమెడియన్స్ తో..
బంగారం రిల్స్ ను చాలామంది సెలబ్రిటీలు కూడా ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు ఆ బంగారం జబర్దస్త్ వరకు వచ్చే అవకాశం వచ్చింది. జబర్దస్త్ స్టేజ్ పై టాప్ కమెడియన్స్ తో కనిపించినట్లుగా కొన్ని విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. చలాకి చంటి హైపర్ ఆది ఇలా కొంతమందితో ఆమెతో ఉన్నట్లు తెలుస్తోంది. ఛీ పోరా అంటూ ఆమె జబర్దస్త్ లో ఒక కామెడీ స్కిట్ లో కూడా పాల్గొందట. చూస్తూ ఉంటే బంగారంకు సరికొత్త కెరీర్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ట్రోల్ చేయడం వల్లే..
ఇక బంగారం కు సంబంధించిన అనేక రకాల వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇంకా జబర్దస్త్ లో అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అని హైపర్ ఆది అన్న అంటే తనకు చాలా ఇష్టం అంటూ ఈరోజు ఆయనను కూడా ప్రత్యేకంగా కలుసుకున్నాను అని బంగారం ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. అలాగే తనను ట్రోల్ చేసినవారే ఇక్కడ వరకు తీసుకువచ్చారు అని వారందరికీ థాంక్స్ అని కూడా ఆమె పాజిటివ్ గా స్పందించారు.


Click it and Unblock the Notifications











