Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌కు ఫైర్ స్టార్ ఊహించని షాక్.. అమ్మాయిలు ఉంటారా? ఆ పని చేయిస్తారా అంటూ!

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ రియాలిటీ షో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో సత్తా చాటుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. అంతేకాదు, వరుసగా సీజన్లు మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది.

ఇలా ఇప్పటికే చాలా వాటిని నిర్వహకులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే మరో దాన్ని కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ టీమ్‌కు ఓ సోషల్ మీడియా స్టార్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

Social Media Star Aggipetti Macha Rejects Bigg Boss 7 Telugu Offer

ఏడో సీజన్‌కు డేట్ ఫిక్స్: ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతున్నా తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షో భారీ రేటింగ్‌ను అందుకుంటోంది. ఫలితంగా నిర్వహకులు ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దానిని కూడా మొదలు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఈ సీజన్‌ను ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టబోతున్నారని న్యూస్ లీక్ అయిపోయింది.

సరికొత్త కంటెంట్‌తో షో: తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అలాంటిది ఆరో సీజన్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు రాబోయే ఏడో సీజన్‌ను జనరంజకంగా సాగించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో అంతా ఊహించని విధంగా ఉంటుందని ఇటీవల విడుదలైన ప్రోమోల్లో హోస్ట్ నాగార్జున రివీల్ చేసేశాడు.

ఆ పనుల ప్రోగ్రెస్ ఇలా: సాధారణంగా బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందంటే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ నాలుగు నెలల ముందే మొదలు అవుతుంది. ఇప్పుడు ఏడో సీజన్ వర్క్ కూడా చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. ఇలా ఇప్పటికే హౌస్, స్టేజ్ సెట్‌లను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వహకులు షో నడిపే కాన్సెప్టు మీద వర్క్ చేస్తున్నట్లు తాజాగా సమాచారం లీకైంది.

కంటెస్టెంట్లపై డైలమా: బిగ్ బాస్ షోలో అత్యంత ముఖ్యమైన ప్రాసెస్ కంటెస్టెంట్ల ఎంపికే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఏడో సీజన్ కోసం టీమ్ అత్యంత ఎక్కువగా దీనిపైనే ఫోకస్ చేసింది. ఇలా ఇప్పటికే నిర్వహకులు చాలా మంది సెలెబ్రిటీలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. కానీ, ఇప్పటి వరకూ ఫైనల్ లిస్టును రెడీ చేయలేదని అంటున్నారు. దీంతో దీనిపై డైలమా నెలకొందని టాక్.

అలాంటి వాళ్లే కావాలి: అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌ను జనరంజకంగా మార్చేందుకు నిర్వహకులు కాంట్రవర్శీలతో సంబంధం ఉన్న సెలెబ్రిటీలనే ఎక్కువగా తీసుకు రావాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల స్టార్లుగా మారిన వాళ్లను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఇలా ఇప్పటికే ఎంతో మందితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Social Media Star Aggipetti Macha Rejects Bigg Boss 7 Telugu Offer

అగ్గిపెట్టి మచ్చాతోనూ: సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌ కోసం నిర్వహకులు చాలా మంది సోషల్ మీడియా సెలెబ్రిటీలతో మంతనాలు జరిపారని ముందే చెప్పుకున్నాం. అందులో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సోషల్ మీడియా స్టార్ అగ్గిపెట్టి మచ్చాతోనూ షో నిర్వహకులు చర్చించినట్లు తాజాగా ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Social Media Star Aggipetti Macha Rejects Bigg Boss 7 Telugu Offer

మందు పోస్తారా అని: బిగ్ బాస్ టీమ్ అగ్గిపెట్టి మచ్చాకు కాల్ చేయగా అతడు కోలుకోలేని షాక్ ఇచ్చినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమాచారం ప్రకారం.. అతడు తనకు కాల్ చేసిన బిగ్ బాస్ నిర్వహకులతో 'షోకు వస్తే రోజూ మందు పోస్తారా? అందులో అమ్మాయిలు ఉంటారా' అని అడిగినట్లు తెలిసింది. దీంతో వాళ్లు అగ్గిపెట్టి మచ్చాను లిస్టు నుంచి తప్పించారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X