బిగ్ బాస్‌ షోలోకి బ్యాంకాక్ పిల్ల.. ఆమె ఎవరు? ఏం ఆఫర్ చేశారో తెలిస్తే!

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ రియాలిటీ షో టెలివిజన్ రంగంలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగులో ఈ కార్యక్రమం భారీ స్థాయిలో రేటింగ్‌ను రాబడుతూ సత్తా చాటుతోంది. దీంతో నిర్వహకులు ఏకధాటిగా సీజన్లను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులోకి ఓ బ్యాంకాక్ పిల్ల ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏం ఆఫర్ చేశారు? అనేవి చూద్దాం పదండి!

దుమ్మురేపిన బిగ్ బాస్
చాలా భాషలతో పోల్చుకుంటే బిగ్ బాస్ షోకు తెలుగులోనే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా ఇది అదిరిపోయే రేటింగ్‌ను రాబట్టి దేశంలోనే నెంబర్ వన్ అనిపించుకుంది. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను సైతం పూర్తి చేసుకుంది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది సెలెబ్రిటీలు అవగా.. చాలా మంది ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Social Media Star Bangkok Pilla Likely Entry To Bigg Boss Telugu 8 Show

ఎనిమిదవ సీజన్ రెడీ
బిగ్ బాస్ షోకు సంబంధించి అన్ని సీజన్లు దాదాపుగా ఒకేలా సాగుతున్నాయి. దీంతో జనాల నుంచి దీనికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. అలాంటి సమయంలో ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడిపారు. దీంతో ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మరో కొత్త కాన్సెప్టుతో తీసుకు రాబోతున్నారు. ఇది ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని టాక్.

ఆరోజు నుంచే అంట
తెలుగులో సక్సెస్ అయిన షో కావడంతో బిగ్ బాస్‌పై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఎనిమిదో సీజన్‌ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే అఫీషియల్ లోగోను విడుదల చేశారు. ఇక, ఈ సీజన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచే ప్రారంభించబోతున్నారని ఇప్పటికే అదిరిపోయే సమాచారం బయటకు వచ్చేసింది.

Social Media Star Bangkok Pilla Likely Entry To Bigg Boss Telugu 8 Show

వినోదం అంతులేదు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను అంతులేనంత వినోదం అనే కాన్సెప్టుతో జరపబోతున్నారట. దీనిపై త్వరలోనే ఓ ప్రోమో రిలీజ్ చేసి ప్రకటించబోతున్నట్లు తెలిసింది. ఇక, ఇప్పటికే ఈ సీజన్‌ కోసం రెండు వేరు వేరే ఇళ్లను నిర్మిస్తున్నారని అంటున్నారు. అలాగే, కంటెస్టెంట్ల ఎంపికలోనూ కొత్తదనం చూపిస్తారని తెలిసింది. ఇలా ఈ సీజన్ అంతా అంతు చిక్కకుండా సాగుతుందన్న మాట.

షోలోకి బ్యాంకాక్ పిల్ల
భారీ ఊహాగానాలు, అంచనాల నడుమ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు మరొకరి పేరు లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. సోషల్ మీడియా స్టార్ 'బ్యాంకాక్ పిల్ల' ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా రాబోతుందని తెలిసింది.

Social Media Star Bangkok Pilla Likely Entry To Bigg Boss Telugu 8 Show

ఆమె ఎవరు అంటే
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రావణి సమంతపుడి బ్యాంకాక్‌లో ఉంటోంది. అక్కడి నుంచి 'బ్యాంకాక్ పిల్ల' పేరుతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో వీడియోలు చేస్తోంది. ఇలా ఈమె తెగ ఫేమస్ అయింది. ఈ కారణంగానే బిగ్ బాస్ టీమ్ శ్రావణిని షోలోకి తీసుకు రాబోతుందట. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తంతో పాటు ఫ్లైట్ ఖర్చులు కూడా ఆఫర్ చేసినట్లు బుల్లితెర వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X