బిగ్ బాస్ షోలోకి ‘స్పై అక్క’.. ఏకంగా ఆ దేశం నుంచి ఎంట్రీ
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని నెంబర్ వన్ షోలుగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చిన ఇది.. కొత్త కొత్త కాన్సెప్టులను చూపిస్తూ యమా హైలైట్ అవుతోంది. అదే సమయంలో భారీ స్థాయిలో రేటింగ్ రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ పేరు ఇంకోటి లీకైంది. ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!
బుల్లితెరపై రారాజులా
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోందన్న విషయం తెలిసిందే. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను సైతం పూర్తి చేసుకుంది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లుగా మారిపోయారు.

ఎనిమిదో సీజన్ రెడీగా
బిగ్ బాస్ అనేది తెలుగు బుల్లితెరపై చెరగని ముద్రను వేసుకుని సాగిపోతోంది. అందుకే నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను జరుపుతున్నారు. అయితే, ఆ మధ్య దీనికి రెస్పాన్స్ కాస్త స్లో అయినా ఏడో సీజన్‌తో మళ్లీ పుంజుకుంది. దీంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను నిర్వహకులు గ్రాండ్‌గా మొదలెట్టబోతున్నారు. ఇప్పటికే లోగోతో పాటు ప్రోమోలను కూడా వదిలారు.
అప్పటి నుంచే స్టార్ట్స్
వేరే ఏ భాషలోనూ రాని విధంగా రేటింగ్‌ను అందుకుంటోన్న బిగ్ బాస్‌పై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఎనిమిదో సీజన్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సీజన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచే ప్రారంభించబోతున్నారని ఇప్పటికే న్యూస్ లీకైంది. అంతేకాదు, ఎన్నో రకాల పనులను కూడా నిర్వహకులు శరవేగంగా చేస్తున్నారు.
ఈసారి కాన్సెప్ట్ ఇదే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను అంతులేనంత వినోదం అనే కాన్సెప్టుతో ప్రసారం చేయబోతున్నారు. దీనిపై ఇటీవలే ఓ ప్రోమో రిలీజ్ చేసి ప్రకటించారు. ఇక, ఇప్పటికే ఈ సీజన్ కోసం రెండు వేరు వేరే ఇళ్లను నిర్మించారని అంటున్నారు. అలాగే, కంటెస్టెంట్ల ఎంపికలోనూ కొత్తదనం చూపిస్తారట. ఇలా ఈ సీజన్ అంతా ఎవరూ ఊహించని విధంగా ఎంటర్‌టైనింగ్‌గా సాగనుందని టాక్.
బిగ్ బాస్‌లో స్పై అక్క
ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం అవబోతుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు మరొకరి పేరు లీక్ అయిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. సోషల్ మీడియా స్టార్, రివ్యూవర్ 'స్పై అక్క' ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా రాబోతున్నారట.

ఆ దేశం నుంచి రాక
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ విదేశాల్లో ఉంటున్నారు. అక్కడి నుంచి 'స్పై అక్క' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో బిగ్ బాస్ షోపై రివ్యూలు చేస్తున్నారు. ఇలా ఈమె బాగా ఫేమస్ అయ్యారు. ఈ కారణంగానే బిగ్ బాస్ టీమ్ ఆమెను షోలోకి తీసుకు రాబోతుందని అంటున్నారు. షో మీద ఉన్న మక్కువతోనే సదరు మహిళ ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











