»   » తన పట్ల క్రూరంగా ప్రవర్తించాడంటూ హాట్ లేడీ ఫిర్యాదు

తన పట్ల క్రూరంగా ప్రవర్తించాడంటూ హాట్ లేడీ ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ముంబై: బిగ్ బాస్-7 రియాల్టీ షో పోటీ దారు, నటి సోఫియా హయత్...తన‌తో పాటు ఈ రియాల్టీ షోలో పాల్గొన్న అర్మాన్ కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్-7 షోలో అర్మాన్ కోహ్లి తనను బూతులు తిట్టాడని, తన పట్ల క్రూరంగా ప్రవర్తించాడని ఆమె ముంబైలోని శాంతాక్రజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోఫియా హయత్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అతనిపై 323, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. విచారణ జరుపుతున్నారు.

    కాగా అర్మాన్ కోహ్లీపై ఇంతకు ముందు కూడా పలు వివాదాలు చెలరేగాయి. హౌస్‌లో నటి తనీషా ముఖర్జీ (కాజోల్ చెల్లెలు), నటుడు అర్మాన్ కోహ్లి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇపుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టోంది. వీరిద్దరి సంబాషణ బట్టి ఇద్దరూ కోరికను అణచుకోలేక పోతున్నారని, ఒకరితో ఒకరు సెక్స్ కోసం తహతహ లాడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

    గతంలోనూ వీరిద్దరూ కలిసి నగ్నంగా కెమెరాకు దొరికిపోవడం సంచలనం సృష్టిస్తించింది. హౌస్‌లో వెళ్లినప్పట్నించీ సన్నిహితంగా మెలగుతూ వస్తున్న ఆ ఇద్దరూ నగ్నంగా, సన్నిహితంగా కనిపించి, కెమెరాకు దొరికిపోయారు. అయితే ఆ సన్నివేశాల్ని షోలో ప్రసారం చేయకపోయినా వాటి ఫుటేజ్‌ను చూసిన 'బిగ్ బాస్' టీమ్ సభ్యులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.

    సోఫియా హయత్ గురించిన వివరాల్లోకి వెళితే... బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బిఏ హానర్స్ చేసింది. పలు యాక్టింగ్ కోర్సులు కూడా చేసింది. అమెరికర్ టీవీషోల్లో ఫేమస్ అయిన డేవిడ్ స్క్విమ్మెర్ వద్ద శిక్షణ తీసుకుంది. టీవీ యాడ్లతో సోఫియా హయత్ తన కెరీర్ ప్రారంభించింది. పలు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ప్రచారం చేసింది. 16వ ఏటనే నటనను వృత్తిగా మొదలు పెట్టింది. BBCలో ప్రసారమైన Absolute Power అనే కార్యక్రమంలో Stephen Fryతో కలిసి నటించింది.

    ఇప్పటి వరకు ఆమె ది అన్‌ఫర్‌గెటబుల్, క్యాష్ అండ్ కర్రీ, నచ్ లే లండన్, భాయ్ కమాల్ హై, డైరీ ఆఫ్ బటర్ ఫ్లై చిత్రాల్లో నటించింది కానీ గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఎంటర్టెన్మెంట్ రంగంలో అవకాశాల కోసం సోఫియా హయత్ ముంబైలోనే మకాం వేసింది. మోడలింగ్, టీవీ షోలు, సినిమాలు ఇలా ఏ అవకాశం వచ్చినా చేస్తోంది.

    English summary
    Sofia Hayat has registered a police complaint against actor Armaan Kohli, her co-contestant on reality show "Bigg Boss-Saath 7", the British actress-singer's manager said.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more