For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌‌లో చిచ్చు పెట్టిన మటన్ కూర.. సోహైల్ ఘాటుగా మాటలు.. అరియానా హార్ట్

    |

    బిగ్‌బాస్ ఇంటిలో ఎక్కువగా గొడవలు జరిగాయంటే కేవలం ఫుడ్ విషయంలోనే అని చెప్పవచ్చు. ఫుడ్ వేస్టేజ్ విషయంపై సోహైల్, మెహబూబ్, హారిక మధ్య గమ్మత్తైన చర్చ జరిగింది. ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. అలా వేస్ట్ చేయడం కంటే అందరికి మంచిగా పెట్టవచ్చు కదా అంటూ సోహైల్ అన్నాడు. ఈ విషయం ఇంట్లో చిన్నపాటి గోడవకు దారి తీసింది. అయితే ఈ విషయంపై అరియానా హర్ట్ కావడంతో ఇంట్లో కాస్త ఎమోషనల్ వాతావరణం నెలకొన్నది. ఇంతకు ఏం జరిగిందంటే..

    అరియానా మటన్ కూర

    అరియానా మటన్ కూర

    బిగ్‌బాస్ ఇంటిలో 47వ రోజున అరియానా మటన్ కూర వండారు. అయితే మాస్టర్ వంట చేస్తే బాగుండేది అంటూ అరియానాతో సోహైల్ అన్నారు. అయితే మాస్టర్ ఆదివారం వంట చేస్తారు అంటూ అరియానా చెప్పారు. సోహైల్ తన వంట గురించి మాట్లాడటంతో హర్ట్ అయ్యారు.

    మూడు మటన్ ముక్కేలేనా

    మూడు మటన్ ముక్కేలేనా

    డైనింగ్ టేబుల్‌పై సోహైల్ మాట్లాడుతూ.. మటన్ మూడు ముక్కలు వేశారు. అలా తక్కువగా పెట్టే బదులు ఎక్కువ వండేసి.. ఫుడ్‌ను సక్రమంగా యూజ్ చేసుకోవచ్చు కాదా అంటూ సోహైల్ అన్నారు. చిన్న చిన్న మూడు ముక్కలు తింటే తిన్నాననే ఫీలింగ్ కలుగలేదు. తింటే బగ్గ తిన్నాననే ఫీలింగ్ కలుగాలి. కొంచెం కొంచెం ఎందుకు పెడుతారు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

    మటనే కాదు.. చికెన్ విషయంలో కూడా

    మటనే కాదు.. చికెన్ విషయంలో కూడా

    కేవలం మాంసం విషయంలోనే కాదు చికెన్ విషయంలో కూడా అదే జరుగుతున్నది. రేషన్‌ను సరిగా వాడితే అందరికి మంచి ఫుడ్ ఉంటుంది అంటూ మెహబూబ్ కూాడా టాపిక్‌ను రైజ్ చేశాడు. ఇలా సోహైల్, మెహబూబ్ మాటలను హారిక ఆసక్తిగా వింటూ కనిపించింది. అయితే ఎక్కువ కర్రీ కావాలనే ఉద్దేశంతో నీళ్లు ఎక్కువగా పోయడంతో టేస్ట్ కొద్దిగా తగ్గింది అంటూ హారిక అనడం కనిపించింది.

    Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
    అవును నేను హర్టయ్యానని అరియానా

    అవును నేను హర్టయ్యానని అరియానా

    ప్రస్తుతం ఇంటిలో రేషన్ మేనేజర్‌గా అరియానా గ్లోరి వ్యవహరిస్తున్నారు. అవినాష్ కెప్టెన్‌గా ఎన్నికైన తర్వాత అరియానాను రేషన్ మేనేజర్‌గా నియమించి సంగతి తెలిసిందే. అయితే తన మాటలకు నొచ్చుకొన్నారనే విషయంపై అరియానాతో సోహైల్ మాట్లాడారు. నేను వంట చేసినందుకు మీరు అలా మాట్లాడితే కష్టంగా అనిపించింది. అందుకే కొంచెం ఇబ్బంది అనిపింపింది. ఇప్పుడు ఆ విషయం అవసరం లేదు అని అరియానా చెప్పింది. అయితే అరియానాకు మద్దతుగా అఖిల్ కూడా నాకు కూడా ఇబ్బంది అనిపించింది అంటూ కామెంట్ చేశారు.

    English summary
    Bigg Boss Telugu's 47 day update: Akhil Sarthak warns Monal Gajjar in Bigg Boss Telugu 4 on 47th day. Plates cleaning issue make awkward between Monal and Akhil. In this situation, Monal says Akhil Egoistinc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X