Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్‌బాస్‌లో చిచ్చు పెట్టిన మటన్ కూర.. సోహైల్ ఘాటుగా మాటలు.. అరియానా హార్ట్
బిగ్‌బాస్ ఇంటిలో ఎక్కువగా గొడవలు జరిగాయంటే కేవలం ఫుడ్ విషయంలోనే అని చెప్పవచ్చు. ఫుడ్ వేస్టేజ్ విషయంపై సోహైల్, మెహబూబ్, హారిక మధ్య గమ్మత్తైన చర్చ జరిగింది. ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. అలా వేస్ట్ చేయడం కంటే అందరికి మంచిగా పెట్టవచ్చు కదా అంటూ సోహైల్ అన్నాడు. ఈ విషయం ఇంట్లో చిన్నపాటి గోడవకు దారి తీసింది. అయితే ఈ విషయంపై అరియానా హర్ట్ కావడంతో ఇంట్లో కాస్త ఎమోషనల్ వాతావరణం నెలకొన్నది. ఇంతకు ఏం జరిగిందంటే..
అరియానా మటన్ కూర
బిగ్‌బాస్ ఇంటిలో 47వ రోజున అరియానా మటన్ కూర వండారు. అయితే మాస్టర్ వంట చేస్తే బాగుండేది అంటూ అరియానాతో సోహైల్ అన్నారు. అయితే మాస్టర్ ఆదివారం వంట చేస్తారు అంటూ అరియానా చెప్పారు. సోహైల్ తన వంట గురించి మాట్లాడటంతో హర్ట్ అయ్యారు.
మూడు మటన్ ముక్కేలేనా
డైనింగ్ టేబుల్‌పై సోహైల్ మాట్లాడుతూ.. మటన్ మూడు ముక్కలు వేశారు. అలా తక్కువగా పెట్టే బదులు ఎక్కువ వండేసి.. ఫుడ్‌ను సక్రమంగా యూజ్ చేసుకోవచ్చు కాదా అంటూ సోహైల్ అన్నారు. చిన్న చిన్న మూడు ముక్కలు తింటే తిన్నాననే ఫీలింగ్ కలుగలేదు. తింటే బగ్గ తిన్నాననే ఫీలింగ్ కలుగాలి. కొంచెం కొంచెం ఎందుకు పెడుతారు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
మటనే కాదు.. చికెన్ విషయంలో కూడా
కేవలం మాంసం విషయంలోనే కాదు చికెన్ విషయంలో కూడా అదే జరుగుతున్నది. రేషన్‌ను సరిగా వాడితే అందరికి మంచి ఫుడ్ ఉంటుంది అంటూ మెహబూబ్ కూాడా టాపిక్‌ను రైజ్ చేశాడు. ఇలా సోహైల్, మెహబూబ్ మాటలను హారిక ఆసక్తిగా వింటూ కనిపించింది. అయితే ఎక్కువ కర్రీ కావాలనే ఉద్దేశంతో నీళ్లు ఎక్కువగా పోయడంతో టేస్ట్ కొద్దిగా తగ్గింది అంటూ హారిక అనడం కనిపించింది.
Recommended Video
అవును నేను హర్టయ్యానని అరియానా
ప్రస్తుతం ఇంటిలో రేషన్ మేనేజర్‌గా అరియానా గ్లోరి వ్యవహరిస్తున్నారు. అవినాష్ కెప్టెన్‌గా ఎన్నికైన తర్వాత అరియానాను రేషన్ మేనేజర్‌గా నియమించి సంగతి తెలిసిందే. అయితే తన మాటలకు నొచ్చుకొన్నారనే విషయంపై అరియానాతో సోహైల్ మాట్లాడారు. నేను వంట చేసినందుకు మీరు అలా మాట్లాడితే కష్టంగా అనిపించింది. అందుకే కొంచెం ఇబ్బంది అనిపింపింది. ఇప్పుడు ఆ విషయం అవసరం లేదు అని అరియానా చెప్పింది. అయితే అరియానాకు మద్దతుగా అఖిల్ కూడా నాకు కూడా ఇబ్బంది అనిపించింది అంటూ కామెంట్ చేశారు.