మరింత బిజీగా మారనున్న సోహెల్.. బాలీవుడ్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అతనికంటే కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్ మాత్రం సోహెల్ అనే చెప్పాలి. అతను ఎక్కడికి వెళ్లినా కూడా జనాలు ఎగబడి వస్తున్నారు. బిగ్ బాద్ 4 ఫైనల్ వరకు వచ్చిన అతను టాప్ 5లో ఉండగానే చాలా తెలివిగా అడుగులు వేశాడు. ప్రైజ్ మనీ విషయంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం బాగానే ఉపయోగపడింది. ఇక ప్రస్తుతం హీరోగా అబిజిత్ కంటే స్పీడ్ గా ఛాన్సులు అందుకుంటున్న సోహెల్ బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి కూడా వివరణ ఇచ్చాడు.

కేవలం బిగ్ బాస్ 4 ద్వారానే..
బిగ్ బాస్ సీజన్ 4లో మొదట పెద్దగా అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ సోహెల్. సినిమాల్లో సైడ్ రోల్స్, సీరియల్స్ చేసుకుంటూ చాలా తక్కువ స్థాయిలో క్రేజ్ అందుకున్న సోహెల్ ఎంత ట్రై చేసినా బ్రేక్ దొరకలేదు. కేవలం బిగ్ బాస్ 4 ద్వారానే సోహెల్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. హౌజ్ లో అతని స్టైల్ అలాగే బాషాతోనే సరికొత్తగా అకట్టుకోవడం బాగా కలిసొచ్చింది.

జార్జిరెడ్డి టీమ్ తో న్యూ మూవీ
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది సోహెల్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. వరుసగా ఆఫర్లు అయితే వస్తున్నాయట. కానీ సోహెల్ మాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే జార్జిరెడ్డి మేకర్స్ తో ఒక సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ
ఇక రీసెంట్ గా తన రోజ్ విల్లా అనే ఒక సినిమా ప్రచారంలో పాల్గొన్న సోహెల్ అక్కడ బాలీవుడ్ ఎంట్రీపై వివరణ ఇచ్చాడు. బాలీవుడ్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ రామరావు అనే ఒక కొత్త దర్శకుడు వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడు. కొంతమంది బాలీవుడ్ నటులు కూడా ఆ సిరీస్ లో నటిస్తున్నారు. అలాంటి ప్రాజెక్ట్ లో తాను కూడా భాగం కాబోతున్నట్లు వివరణ ఇచ్చాడు సోహెల్.

భవిష్యత్తులో డ్రీమ్ ప్రాజెక్ట్ అదే..
అయితే సింగరేణి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని సోహెల్ అనుకుంటున్నాడట. మొన్న జరిగిన ఒక సన్మాన సభలో కూడా సోహెల్ తనకు కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమా చేయాలని ఉందని వివరణ ఇచ్చారు. తన జిల్లా వాసులు చూపిస్తున్న ప్రేమ కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది అంటూ.. తప్పకుండా అలాంటి కోణంలో ఒక సినిమాను తేవడానికి ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. మరి అతని వద్దకు రాబోయే దర్శకులు ఎలాంటి కథలను పట్టుకొస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











