Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ట్రాఫిక్ జామ్‌తో రచ్చ.. ఇంచు కూడా కదలని కారు.. సోహెల్ క్రేజ్‌కు నిదర్శనమిదే
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ కంటెస్టెంట్లపై మొదట్లో ఓ అభిప్రాయం ఏర్పడింది. ఇలాంటి కంటెస్టెంట్లను ఎలా తీసుకొచ్చారంటూ బిగ్ బాస్ టీంను ఏకిపారేశారు. కానీ ఇప్పుడు అదే కంటెస్టెంట్లపై నెటిజన్లు, ప్రేక్షకులు అభిమానులుగా మారారు. ఒక్కో కంటెస్టెంట్‌కు తమకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో మరీ ముఖ్యంగా అభిజిత్ సోహెల్‌లు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. మామూలుగా జనాల దృష్టిల్లో అయితే అభిజిత్ విన్నర్, సోహెల్ రన్నర్. కానీ డబ్బులు తీసుకుని గేమ్ నుంచి తప్పుకోవడంతో అఖిల్ రన్నర్‌గా మిగిలాడు.
ఓ రకంగా విజేత..
సోహెల్ బిగ్ బాస్ ఆటలో విజేతగా నిలిచాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైజ్ మనీ విషయంలో అభిజిత్ సోహెల్ ఒకేస్థాయిలో ఉన్నారు. ఇక నాగార్జున అదనంగా ఇస్తాను అని చెప్పింది కూడా ఖాతాలో వేసుకుంటే సోహెల్ ముందంజలో ఉంటాడు. అలా అభిజిత్ కంటే ఎక్కువగా క్యాష్ తెచ్చుకుని ఆ రకంగానూ విన్నర్ అయినట్టే.
ప్రస్తుతానికి ఇక్కడే..
సోహెల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన సొంత గ్రామానికి వెళ్లలేదు. ఇప్పుడు వెళ్లే పరిస్థితి కూడా లేదని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు గుర్తు పడుతున్నారని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఉదయం టీ తాగడానికి వెళ్లేవాడిని కానీ ఇప్పుడు వెళ్లలేకపోతోన్నానని సోహెల్ అన్నాడు.
పెళ్లి ఉందంటూ..
ఇంత వరకు ఇంటికి వెళ్లలేదు.. వెళ్లాలి.. సిస్టర్ పెళ్లి ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చెల్లి పెళ్లికి పనులు చేయాల్సి ఉంటుంది కదా వెళ్లాలి అంటూ సోహెల్ చెప్పాడు. అందుకోసమే ఇప్పుడు సోహెల్ తన సొంతూరుకు బయల్దేరాడు. అలా మధ్యలో సోహెల్ తన అభిమానులు కలిశారు.
ట్రాఫిక్ జాం..
ఇక సోహెల్‌ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. షేక్ హ్యాండ్ ఇస్తూ.. సెల్ఫీలతో రచ్చ రచ్చ చేశారు. జనాలు గుంపులుగుంపులుగా రావడంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. ట్రాఫిక్ జాంతో ఆ ఏరియా అంతా రచ్చ రచ్చగా మారింది. ఆ జనాల మధ్యల్లోంచి కారు ఇంచు కూడా కదలడం లేదంలే సోహెల్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.