గొంతు మార్చి ఆ విషయాలు మాట్లాడుతూ.. అభిజిత్‌ను బక్రా చేసిన సోహెల్!
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక అభిజిత్ సోహెల్ అభిమానుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. మెహబూబ్ హింట్ ఇవ్వడంతో సోహెల్ క్యాష్ ప్రైజ్ తీసుకున్నాడని, అభిజిత్‌కు ప్రైజ్ మనీ కట్ అయిందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా సోహెల్ మెహబూబ్ స్కాం వీడియోపై రకరకాల వాదనలు వినిపించాయి. అయితే వీటిపై ఆ ముగ్గురూ రియాక్ట్ అయ్యారు. ముగ్గురు కూడా ఫ్రెండ్స్‌గానే ఉన్నారు.కానీ అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతున్నారు.

ఫ్యాన్స్ వార్..
అభిజిత్ ఫ్యాన్స్ మెహబూబ్, సోహెల్ మీద ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. స్కాం, 420 అంటూ ఆ ఇద్దరినీ ఏకిపారేశారు. అయితే సోహెల్ ఫ్యాన్స్ సైతం రివర్స్ అటాక్ చేశారు. తానేమీ తప్పు చేయలేదని, మెహబూబ్ తనకేమీ చెప్పలేదని సోహెల్ పలు మార్లు క్లారిటీ ఇచ్చాడు.

స్నేహంగానే ఉన్నామని..
అభిజిత్ అంటే తనకు ఇష్టమని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని సోహెల్ క్లారిటీ ఇచ్చాడు. ఫ్యాన్స్ మాత్రం ఇలా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు.. అలా చేయకండని కోరాడు. తనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ అంటే నచ్చదని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఓ వీడియో..
సోహెల్ మెహబూబ్ కలిసి ఓ వీడియోను చేశారు. మెహబూబ్ తన యూ ట్యూబ్ చానెల్‌లో సోహెల్‌తో చిట్ చాట్ చేశాడు. అందులో ఇద్దరూ కలిసి అభిజిత్‌ను ఆట పట్టించారు. సోహెల్ తన గొంతు మార్చి సినిమా ఆఫర్ అంటూ మాట్లాడాడు.

బాలీవుడ్ మేకర్స్..
బాలీవుడ్ మేకర్స్ అంటూ తన గొంతు మార్చి అభిజిత్‌తో సోహెల్ మాట్లాడాడు. ఏదైనా ఉంటే తన మెయిల్‌కు పంపండి అని అభిజిత్ చెప్పాడు. సినిమా వివరాలు, దర్శకుడు గురించి చెప్పండని అభిజిత్ రివర్స్‌లో అడిగాడు. కానీ సోహెల్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

మల్టీ స్టారర్..
సోహెల్, అభిజిత్‌లను కలిసి ఓ సినిమా తీయాలని అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. చివరకు సోహెల్ తన గొంతుతోనే మాట్లడుతూ.. అభిజిత్‌ను ఆట పట్టించినట్టు చెప్పేశాడు. అలా తామంతా ఫ్రెండ్స్‌లా బాగానే ఉన్నామని చెప్పకనే చెప్పేశాడు.


Click it and Unblock the Notifications











