అరియానా.. సుత్తితో తల పగలకొట్టుకోవాలా? సోహైల్‌కు అలా చెమటలు..
అరియానాతో నా బంధం టామ్ అండ్ జెర్రీ లాంటిది. ఎప్పుడు కొట్టుకొంటున్న, గొడవ పెట్టుకొన్న మా మధ్య మంచి అవగాహన ఉంది అంటూ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో సమంత ముందు సోహైల్ చెప్పడం తెలిసిందే. అరియానాను 8 వారం నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా మాట్లాడుతూ.. నిన్ను చూస్తే ఇంట్లో టామ్‌ను చూసినట్టే ఉంటుంది. నేను ఎప్పటికీ జెర్రీనే అంటూ సోహైల్ చెప్పాడు.
తనను నామినేట్ చేయడానికి సోహైల్ ప్రయత్నిస్తుండటంతో అరియానా సీరియస్ అయింది. అలా చూస్తే నాకు భయం వేస్తుంది అంటూ సోహైల్ అంటూ కనిపించాడు. కావాలంటే నేను ఈ సుత్తితో తలపై కొట్టుకోవాలా చెప్పు అంటూ సోహైల్ అనడం ఆసక్తిగా మారింది. అయితే అరియానా అలా సీరియస్‌గా చూస్తుండటంతో.. ఇది అయింది పంచాయితీ. నీకు ఏదైనా చెప్పాలనుకొంటే చెప్పు అంటూ కామెంట్ విసిరాడు. దాంతో ఏమిలేదు అనే ఘాటుగా స్పందించింది.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. 8వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అభిజిత్, అవినాష్, అఖిల్, హారిక, సోహైల్ సేఫ్ అయ్యారు. మిగితా వారందరూ నామినేట్ అయినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











