Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శేఖర్ మాస్టర్‌తో సుధీర్ఘ చర్చలు.. ‘కామెడీ స్టార్స్’లో అరియానాతో సోహెల్ రచ్చ
బిగ్ బాస్ షో ముగిసింది కానీ కంటెస్టెంట్ల హడావిడి మాత్రం తగ్గడం లేదు. కొందరు కంటెస్టెంట్లు మాత్రం ప్రతీ రోజూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నారు. అందులోనూ కొత్త షోలు ప్రారంభం అవ్వడం, బిగ్ బాస్ కంటెస్టెంట్లు మళ్లీ ఎంటర్టైన్ చేస్తుండటంతో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఇప్పుడు ప్లాన్ చేసిన కొత్త షోలు కూడా బాగానే క్లిక్ అవుతున్నాయి. షూటింగ్ గ్యాప్‌లో ఫోటోలు, వీడియాలు తీస్తూ రచ్చ చేస్తున్నారు.
వరుసగా షోలు..
బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇప్పుడు వరుసగా షోలతో బిజీగా ఉన్నాడు. గత ఆదివారం స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ అంటూ రచ్చ చేశారు. ఇందులో భాగంగా సోహెల్, మెహబూబ్, అఖిల్, నోయల్, లాస్య, హారికలు హల్చల్ చేశారు. అయితే ఇక కామెడీ స్టార్స్ అంటూ అవినాష్ సపరేట్ షోను రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
అవినాష్ ప్లాన్స్..
కామెడీ స్టార్స్ అనే కొత్త షో బాధ్యతలు అవినాష్ మీదే ఉన్నాయి. అందుకు అన్ని వ్యవహారాలను దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. అందుకే మొదటి ఎపిసోడ్లో సుజాత, అరియానా, అషూ, తన తమ్ముడు అజయ్ వంటి వారిని పట్టుకొచ్చాడు. స్కిట్లు వేయించాడు.
రెండో ఎపిసోడ్లో అలా..
ఇక వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో సోహెల్ సందడి చేయనున్నాడు. ఈ మేరకు షూటింగ్ కూడా పూర్తి చేసినట్టున్నాడు. షూటింగ్ గ్యాప్‌లో అరియానా, శేఖర్ మాస్టర్, శ్రీదేవీలతో దిగిన ఫోటోలను సోహెల్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Recommended Video
శేఖర్ మాస్టర్‌తో..
అయితే కామెడీ స్టార్స్ షూటింగ్ సెట్లో సోహెల్ బాగానే రచ్చ చేసినట్టు కనిపిస్తున్నాడు. శేఖర్ మాస్టర్‌ను సోహెల్ బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే అది స్కిట్లో భాగంగా చేశాడా? లేదా? ఏదైనా సుధీర్ఘ చర్చలు జరిపాడా? అన్నది చూడాలి. మొత్తానికి అరియానా, జడ్జ్‌గా ఉన్న హీరోయిన్ శ్రీదేవీలతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఇక అరియానా సోహెల్ కలిసి సెట్లో టాప్ లేపినట్టు కనిపిస్తోంది.