twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ మాస్టర్‌తో సుధీర్ఘ చర్చలు.. ‘కామెడీ స్టార్స్’లో అరియానాతో సోహెల్ రచ్చ

    |

    బిగ్ బాస్ షో ముగిసింది కానీ కంటెస్టెంట్ల హడావిడి మాత్రం తగ్గడం లేదు. కొందరు కంటెస్టెంట్లు మాత్రం ప్రతీ రోజూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నారు. అందులోనూ కొత్త షోలు ప్రారంభం అవ్వడం, బిగ్ బాస్ కంటెస్టెంట్లు మళ్లీ ఎంటర్టైన్ చేస్తుండటంతో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఇప్పుడు ప్లాన్ చేసిన కొత్త షోలు కూడా బాగానే క్లిక్ అవుతున్నాయి. షూటింగ్‌ గ్యాప్‌లో ఫోటోలు, వీడియాలు తీస్తూ రచ్చ చేస్తున్నారు.

     వరుసగా షోలు..

    వరుసగా షోలు..

    బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇప్పుడు వరుసగా షోలతో బిజీగా ఉన్నాడు. గత ఆదివారం స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ అంటూ రచ్చ చేశారు. ఇందులో భాగంగా సోహెల్, మెహబూబ్, అఖిల్, నోయల్, లాస్య, హారికలు హల్చల్ చేశారు. అయితే ఇక కామెడీ స్టార్స్ అంటూ అవినాష్‌ సపరేట్ షోను రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

    అవినాష్ ప్లాన్స్..

    అవినాష్ ప్లాన్స్..

    కామెడీ స్టార్స్ అనే కొత్త షో బాధ్యతలు అవినాష్ మీదే ఉన్నాయి. అందుకు అన్ని వ్యవహారాలను దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. అందుకే మొదటి ఎపిసోడ్‌లో సుజాత, అరియానా, అషూ, తన తమ్ముడు అజయ్ వంటి వారిని పట్టుకొచ్చాడు. స్కిట్లు వేయించాడు.

     రెండో ఎపిసోడ్‌లో అలా..

    రెండో ఎపిసోడ్‌లో అలా..

    ఇక వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో సోహెల్ సందడి చేయనున్నాడు. ఈ మేరకు షూటింగ్ కూడా పూర్తి చేసినట్టున్నాడు. షూటింగ్ గ్యాప్‌లో అరియానా, శేఖర్ మాస్టర్, శ్రీదేవీలతో దిగిన ఫోటోలను సోహెల్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

    Recommended Video

    Nithiin's Check Movie Release Date Revealed | Filmibeat Telugu
     శేఖర్ మాస్టర్‌తో..

    శేఖర్ మాస్టర్‌తో..

    అయితే కామెడీ స్టార్స్ షూటింగ్‌ సెట్‌లో సోహెల్ బాగానే రచ్చ చేసినట్టు కనిపిస్తున్నాడు. శేఖర్ మాస్టర్‌ను సోహెల్ బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే అది స్కిట్‌లో భాగంగా చేశాడా? లేదా? ఏదైనా సుధీర్ఘ చర్చలు జరిపాడా? అన్నది చూడాలి. మొత్తానికి అరియానా, జడ్జ్‌గా ఉన్న హీరోయిన్ శ్రీదేవీలతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఇక అరియానా సోహెల్ కలిసి సెట్‌లో టాప్ లేపినట్టు కనిపిస్తోంది.

    English summary
    Sohel With Ariyana In Comedy stars Show, Bigg Boss Fame Jordar Sujatha Dance video Goes viral,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X