Dhee 15 Winner: ఢీ 15 విన్నర్ అతడే.. షాకిచ్చిన లేడీ మాస్టర్.. తీరని చైతన్య మాస్టర్ చివరి కోరిక

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో దక్షిణాదిలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన 'ఢీ' ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త సీజన్లతో ఆడియెన్స్‌ను అలరిస్తోన్న ఈ షో.. ఇప్పుడు పదిహేనో సీజన్‌ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక, అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ బుధవారమే ముగిసింది. మరి ఇందులో విజయం సాధించింది ఎవరు? ఫినాలేలో హైలైట్లు ఏంటి? చూద్దాం పదండి!

Photo Credits: ETV DHee YouTube

సౌతిండియాలో నెంబర్ వన్: తెలుగు స్మాల్ స్క్రీన్‌పై ఎన్నో రకాల డ్యాన్స్‌ షోలు ప్రసారం అయ్యాయి. అయితే, అందులో 'ఢీ' మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను దక్కించుకుంది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ వెళ్తోంది . అందుకు తగ్గట్లుగానే టీఆర్పీని క్రమంగా పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే సౌతిండియాలోనే నెంబర్ వన్ రియాలిటీ డ్యాన్స్ షోగా దూసుకెళ్తోంది.

Somesh Master Team Won Dhee 15 Championship Battle Title

15వ సీజన్.. మరింత డ్యాన్స్: సక్సెస్‌ఫుల్ షోగా పేరొందిన 'ఢీ' తెలుగులో షో పద్నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పదిహేనో దానిని కూడా చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. 'చాంపియన్స్ బ్యాటిల్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ ప్యూర్ డ్యాన్స్‌తో సరికొత్తగా సాగుతూ వచ్చింది.

ఫినాలేలోకి నాలుగు టీమ్‌లు: 'ఢీ' 15వ సీజన్ ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. గత వారమే ఈ సీజన్‌కు సంబంధించిన సెమీ ఫైనల్స్ కూడా పూర్తయ్యాయి. మొత్తంగా ఈ సారి గ్రాండ్ ఫినాలేకు పండు మాస్టర్, సోమేష్ మాస్టర్, గ్రీష్మ మాస్టర్, రేవంత్ మాస్టర్ టీమ్‌లు చేరుకున్నాయి. వీరిలో నుంచి మొదటి రౌండ్‌లో ఒకరు, రెండో రౌండ్‌లో మరొకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు.

Somesh Master Team Won Dhee 15 Championship Battle Title

శ్రీలీలతో పాటు వాళ్లు ఎంట్రీ: ఈ బుధవారం ప్రసారం అయిన 15వ సీజన్ గ్రాండ్ ఎపిసోడ్ కోసం ముఖ్య అతిథిగా లేడీ సెన్సేషన్ శ్రీలీల గెస్టుగా వచ్చింది. అంతకు ముందే 'బెదురలంక' టీమ్ కార్తికేయ, నేహా శెట్టి కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరూ మొదటి రౌండ్ పూర్తయ్యే వరకూ ఉన్నారు. ఇందులో రేవంత్ మాస్టర్ ఎలిమినేట్ అవగా.. మిగిలిన మూడు జట్లూ గ్రాండ్ ఫినాలే రెండో స్టేజ్‌కు వెళ్లాయి.

Somesh Master Team Won Dhee 15 Championship Battle Title

తీరని చైతన్య ఆఖరు కోరిక: 'ఢీ' 15వ సీజన్‌లో ఫేవరెట్ మాస్టర్‌గా వచ్చి.. కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు చైతన్య మాస్టర్. అతడు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో ఈ సీజన్‌లో పండు మాస్టర్ విజయం సాధించాలని కోరుకున్నాడు. కానీ, అతడి చివరి కోరిక తీరకుండానే ఈ టీమ్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ 2లో జరిగిన మొదటి రౌండ్‌లోనే ఎలిమినేట్ అయిపోయింది.

షాకిచ్చిన లేడీ మాస్టర్ గ్రీష్మ: 'ఢీ' 15వ సీజన్ 'చాంపియన్స్ బ్యాటిల్'లో చాలా మంది కొరియోగ్రాఫర్లు వచ్చారు. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం లేడీ మాస్టర్ గ్రీష్మనే. అసాధారణ ప్రదర్శనలతో తన టీమ్‌ను ఫినాలేకు చేర్చిన ఈమె.. ఏకంగా మొదటి రౌండ్‌లోనే రేవంత్, పండు మాస్టర్ల టీమ్‌లను వెనక్కి నెట్టేసి తుది సమరానికి చేరుకుంది. ఇలా అందరికీ కోలుకోలేని షాక్‌నే ఇచ్చేసింది.

Somesh Master Team Won Dhee 15 Championship Battle Title

ఈ సీజన్ విన్నర్‌గా సోమేష్: ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగిన 'ఢీ 15' సీజన్‌లో అసాధారణ రీతిలో పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చిన సోమేష్ మాస్టర్ టీమ్ S9 విజేతగా నిలిచింది. వీళ్లకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీలీల చేతుల మీదగా ట్రోఫీని అందజేశారు. ఆ తర్వాత రూ. 75 లక్షలు క్యాష్ ప్రైజ్‌ను కూడా అందించారు. ఇక, ఇందులో గ్రీష్మ టీమ్ రన్నరప్‌గా నిలిచింది. ఇలా ఈ సీజన్‌ ముగిసిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X