బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్.. నన్ను అలా వాడేశారు.. గుట్టువిప్పిన బ్యూటి
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్.. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో నిర్వహిస్తున్న ఈ షో హిందీలో మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. గత 18 ఏండ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రియాలిటీ షో 18వ సీజన్ కు సిద్దమైంది. బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసే ఈ షో కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్, కండాల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ సారి బిగ్ బాస్ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి ఫేమ్ అండ్ క్రేజీ కంటెస్టెంట్స్ లను రంగంలోకి దించబోతున్నారంట.
అయితే.. ఈ షోలో మరింత జోష్ పెంచడానికి మన కండాల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ లవర్స్ సోమీ అలీ కూడా బరిలోకి దించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ బ్యూటీ గత కొన్ని రోజులుగా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. అయితే.. సోమి అలీ.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలే అయినా.. తన కొంత కాలంగా సాల్ బాయ్ కి వ్యతిరేకంగా హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఒక వేళ ఈ ఫైరింగ్ బ్యూటీ బిగ్ బాస్ షోలో అడుగుపెడితే.. ఈ మరింత హీట్కెతుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై నటి సోమి అలీ స్పందించారు. ఈ ప్రచారంలో ఏది నిజం, ఏది కాదో స్వయంగా సోమి అలీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'నో మోర్ టియర్స్' అనే ఎన్జీవోను కూడా నడుపుతోంది. దాని నిర్వహణ కోసమే చాలా టైం స్పెండ్ చేస్తుంది. ఈ బిజీ షెడ్యూల్ లో తాను షోలో పాల్గొనలేననీ, వాస్తవానికి షోపై తనకు ఆసక్తి లేదని, తనను ఎవరూ సంప్రదించలేదని కుండ బద్దలు కొట్టింది.
సోమి అలీ మాట్లాడుతూ.. 'నేను నా ఎన్జీవోను విడిచిపెట్టి, చాలా కాలం గడపాల్సిన అలాంటి షోలో భాగం కాలేను. ఇప్పటివరకు ఆ షో ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. దానిలో ఏముందో నాకు తెలియదు. అది స్క్రిప్టెడ్ షో అని విన్నాను. నేను దాని పార్టీస్పెట్ కావాలని అనుకోవడం లేదు. మరో నిజం ఏమిటంటే నేను షో గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. అని ప్రకటించింది.

ఒకవేళ నిర్వహకులు సంప్రదిస్తే.. షోలో పాల్గొంటారని ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. ' అది స్క్రిప్ట్ రియాలిటీ షో, వారు నన్ను కంటెస్టెంట్‌గా సంప్రదించినప్పటికీ, నేను పాల్గొనాలని అనుకోను. కాబట్టి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే. ఆ షో రేటింగ్‌లను పెంచే వ్యూహం. ' అంటూ తేల్చేసింది. ఫైనల్ గా 'స్క్రిప్టెడ్ రియాలిటీ షోలో పాల్గొనే ఉద్దేశం తనకు లేదనీ, హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో తనకున్న గత సంబంధాల కారణంగా తాను ఈ షో పాల్గొంటే రేటింగ్స్ పెరుగుతాయని ఆమె అభిప్రాయపడింది.
ఇదిలాఉంటే.. బిగ్ బాస్ హిందీ సీజన్ 18 సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో కలర్స్ టీవీలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 'బిగ్ బాస్ 18'కి హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరించబోతున్నారంట. అయితే.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్.. రష్మిక మందన్నతో తన రాబోయే చిత్రం 'సికందర్' చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడని, అందుకే 'బిగ్ బాస్ OTT 3' హోస్ట్ ను రిజెక్ట్ చేశాడని టాక్.


Click it and Unblock the Notifications











