ఆ మాటలు చెప్పి బట్టలు విప్పాడు.. బలవంతంగా క్రీమ్ పూసి.. నటి షాకింగ్ కామెంట్స్!

Recommended Video

#Metoo : Sonal Vengurlekar Talks About Raja Bajaj

మీటూ ఉద్యమం నేపథ్యంలో పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మీటూ ఉద్యమం ద్వారా చీకట్లో ఉండిపోయిన లైంగిక వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులో వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ల నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు అంతా మీటూ ఉద్యమంలో పాలుపంచుకుంటుండడంతో బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రముఖ టివి నటి సోనాల్ వెంగురేల్కర్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

ఆన్లైన్‌లో ప్రకటన చూసి

ఆన్లైన్‌లో ప్రకటన చూసి

యువనటి సోనాల్ వెంగురేల్కర్ పలు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా కాస్టింగ్ డైరెక్టర్ రాజా బజాజ్ అత్యంత నీచంగా ప్రవర్తించాడని సోనాల్ తెలిపింది. ఆన్లైన్ లో ప్రకటన చూసి ఆడిషన్స్ కోసం అని అతడి వద్దకు వెళ్లినట్లు సోనాల్ తెలిపింది.

బలవంతంగా బట్టలు విప్పి

బలవంతంగా బట్టలు విప్పి

ఆడిషన్స్ పేరుతో ఫోటో షూట్ నిర్వహించారు. ఫోటో గ్రాఫర్, రాజా బజాజ్ ఇద్దరూ తనతో అసభ్యంగా ప్రవర్తించారని జరిగిన ఘటనని వివరించింది. తనకు తాంత్రిక విద్యలు తెలుసు అని, రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయ్యేలా తాంత్రిక పూజ చేస్తామని మభ్యపెట్టి బట్టలు మొత్తం విప్పమన్నాడు. అతడి మాటలకు షాక్ కి గురయ్యా. దీనితో అతడే తనవద్దకు వచ్చి బలవంతంగా బట్టలు విప్పేశాడు అంటూ సోనాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

బలవంతంగా క్రీమ్ పూశాడు

బలవంతంగా క్రీమ్ పూశాడు

మరో మోడల్ తో ఆడిషన్ నిర్వహిస్తూ తనకు ఓ బాటిల్ లో క్రీమ్ ఇచ్చి ఎదకు పూసుకోమని ఆదేశించాడు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అప్పటికీ నేను షాక్ లో ఉన్నా అంటూ సోనాల్ తెలిపింది. మళ్ళీ నా వద్దకు వచ్చి బలవంతంగా క్రీమ్ తీసుకుని బలవంతంగా నా శరీరంపై పూశాడు.

 భరించలేక

భరించలేక

అతడి వేధింపులు భరించలేక అక్కడి నుంచి పారిపోయానని సోనాల్ తెలిపింది. ఈ ఘటనపై 2012 లో అతడిపై తాను కేసు నమోదు చేసినట్లు సోనాల్ తెలిపింది. అప్పట్లో నేను ఇండస్ట్రీకి కొత్త తన వేదన ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాలేదని సోనాల్ తెలిపింది.

ఖండించిన రాజా బజాజ్

ఖండించిన రాజా బజాజ్

సోనాల్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలని రాజా బజాజ్ ఖండించారు. సోనాల్ డిమాండ్ చేసినంత డబ్బు మేము ఇవ్వలేదు. అందువలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని రాజా బజాజ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X