Bigg Boss Telugu 8: సోనియా ఆకులకు షాకింగ్ రెమ్యూనరేషన్.. 4 వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే!

నేషనల్ వైడ్‌గా చాలా భాషల్లో రన్ అవుతోన్నా.. తెలుగులో మాత్రం అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ షోగా ప్రభావాన్ని చూపిస్తోంది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని సరికొత్త హంగులతో చాలా కొత్తగా నడుపుతున్నారు. ఇక, ఇందులో బ్యూటిఫుల్ కంటెస్టెంట్‌ అనిపించుకున్న సోనియా ఆకుల.. 4వ వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ సీజన్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలను మీరే చూసేయండి!

కంటెంట్ మారడంతో ఫుల్
తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది. అలా ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్ కూడా మొదలై మరింత కొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికి ఆశించిన దానికంటే ఎక్కువ రేటింగ్ వస్తోంది. దీంతో మరిన్ని సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ప్లాన్ చేస్తూ నిర్వహకులు ఈ సీజన్‌ను మరింత రంజుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

Sonia Akula Bigg Boss Season 8 Remuneration Details Leaked

ఆరంభంలోనే ఫుల్ క్రేజ్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ముందుగా 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. వీళ్లంతా తమ తమ రంగాల్లో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. అందులో సోనియా ఆకుల ఒకరు. రాంగోపాల్ వర్మ వల్ల హైలైట్ అయిన ఈ చిన్నది.. మొదటి రోజు నుంచే తనదైన ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది.

అప్పుడు పేరు.. ఇప్పుడు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పటి నుంచే సోనియా ఆకుల తన మార్కు చూపించే ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా షోలో తనదైన రీతిలో కామెంట్లు చేస్తూ, ఆడుతూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, క్రమంగా ఆమె ఎదుటి వారిపై పర్సనల్ ఎటాక్ చేయడం, లవ్ ట్రాకులు నడపడంతో విమర్శలు తెచ్చుకుంది. దీంతో ఎన్నో గొడవల్లో భాగం అయింది.

Sonia Akula Bigg Boss Season 8 Remuneration Details Leaked

4వ వారంలో ఎలిమినేట్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో మొదటి వారంలో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా, మూడో వారంలో అభయ్‌లు ఎలిమినేట్ అయ్యారు. అయితే, నాలుగో వారంలో మాత్రం ఎవరు వెళ్తారన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో 4వ వారం ఎలిమినేషన్‌లో సంచలనం కనిపించింది. ఇందులో సోనియా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.

సోనియా రెమ్యూనరేషన్
బిగ్ బాస్ హౌస్‌లోకి మంచి అంచనాలతో వచ్చి.. ఓ రేంజ్‌లో విమర్శలను ఎదుర్కొన్న సోనియా ఆకులు నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. సోనియాకు ఒక్కో వారానికి రూ. 2.00 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది.

Sonia Akula Bigg Boss Season 8 Remuneration Details Leaked

అన్ని లక్షలు వచ్చాయి

బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. సోనియా ఆకులకు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం రోజుకు రూ. 28 వేల చొప్పున వారానికి రూ. 2.00 లక్షలు చార్జ్ చేసిందట. అలా 4 వారాల పాటు ఉన్న సోనియా మొత్తంగా రూ. 8 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ఆమె బిగ్ బాస్ షోలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X