Bigg Boss Telugu 8: 4వ వారం ఎలిమినేషన్ ఫిక్స్.. అదే జరిగితే బిగ్ బాస్ షో పని ఔట్
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు రన్ అవుతోన్నా.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ దూసుకెళ్తోన్న ఏకైక రియాలిటీ షోనే బిగ్ బాస్. అంతలా ఇది ఎనిమిదేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా సత్తా చాటుతోంది. దీంతో ఇప్పుడు ఎనిమిదో దాన్ని అన్‌లిమిటెడ్ అనే కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్ ఇప్పుడు నాలుగో వారానికి చేరుకుంది. మరి ఈ వారంలో ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? చూసేద్దాం పదండి!
విభిన్నమైన కాన్సెప్టుతోనే
బిగ్ బాస్ అంటేనే చాలు అది ఎలాంటి కంటెంట్‌తో సాగుతున్నా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటిది ఇప్పుడు జరుగుతున్న 8వ సీజన్ అన్‌లిమిటెడ్ అనే కాన్సెప్టుతో గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులతో నడుస్తోంది. అంతేకాదు, ఇందులో టాస్కులు, నామినేషన్స్, ఓటింగ్, ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్స్ ఇలా అన్నీ చాలా కొత్తగానే సాగుతున్నాయని చెప్పుకోవాలి.

ముగ్గురు ప్లేయర్లు అవుట్
తాజా ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్‌లు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.
నాలుగో వారంపై ఆసక్తి
ఎనిమిదో సీజన్ ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. అలా నాలుగో వారంలో కూడా నామినేషన్స్ రంజుగానే సాగాయి. ఇందులో మొత్తంగా నబీల్, సోనియా ఆకుల, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు. అయితే, చీఫ్ నిఖిల్‌కు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌తో నైనికను సేవ్ చేశాడు. దీంతో ఈ వారంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఓటింగ్‌లో ట్విస్టులతోనే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో టైటిల్ ఫేవరెట్లు అనే వాళ్లు లేరు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా నబీల్ అఫ్రిదీ ఒక్కడే దాదాపు 35 శాతం వరకూ ఓటింగ్ సాధిస్తున్నాడు. ఇలా ఈ వారం మొత్తం అతడు ఆధిపత్యం ప్రదర్శిస్తూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
వాళ్ల స్థానాలన్నీ చేంజ్
ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారంలోని ఓటింగ్‌లో నబీల్ హవాను చూపిస్తున్నాడు. అతడి తర్వాత ప్రేరణకు కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య చాలా తక్కువగానే తేడా ఉన్నట్లు తెలిసింది. ఇక, గురువారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత మణికంఠకు ఓటింగ్ పెరిగి మూడో స్థానానికి చేరుకున్నాడు. వీళ్ల తర్వాత అంటే నాలుగో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నట్లు తెలిసింది.
ఎలిమినేషన్ ఫిక్స్ అని
నాలుగో వారం ఓటింగ్‌లో ప్రస్తుతం ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. అలాగే అందరి కంటే చివర్లో అంటే ఆరో స్థానంలో సోనియా ఆకుల ఉంది. ఈరోజుతో ఓటింగ్ ముగియనుంది. దీంతో 4వ వారంలో సోనియానే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంతా ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఇది మారితే బిగ్ బాస్ షోపై క్రెడిబిలిటీ పోయి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది.


Click it and Unblock the Notifications











