Bigg Boss Elimination: ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. 4వ వారం ఊహించని రిజల్ట్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్
కొంత మంది సెలెబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచి.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులను ఇచ్చి.. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించే షోనే బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయం అయిన ఈ కార్యక్రమం.. ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సూపర్ సక్సెస్ అయింది. దీంతో నిర్వహకులు కొత్త సీజన్లతో వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఇందులో నాలుగో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌పై తాజాగా ఓ సంచలన విషయం లీక్ అయింది. ఆ వివరాల్లోకి వెళ్తే...
ఇది కదా అసలైన వినోదం
బిగ్ బాస్ ఇప్పటి వరకూ తెలుగులో ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. కానీ, వీటన్నింటిలోనూ చూపించని కొత్త కొత్త కంటెంట్‌ను ఎనిమిదో సీజన్‌లో ప్రసారం చేస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ షో రేటింగ్‌ను కూడా భారీగా రాబడుతోంది. దీంతో నిర్వహకులు మరింత ఉత్సాహంతో కొత్త కొత్త టాస్కులు ఇస్తున్నారు.

ఎవరెవరు వెళ్లిపోయారు?
ఎనిమిదో సీజన్‌లోకి కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో మొదటి వారం నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్‌లు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.
నాలుగో వారం ఆరుగురు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఆరంభం నుంచే మజాను పంచుతోంది. అలా నాలుగో వారంలో కూడా నామినేషన్స్ గొడవలతో సాగాయి. ఇందులో మొత్తంగా నబీల్, సోనియా ఆకుల, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు. అయితే, చీఫ్ నిఖిల్‌కు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌తో నైనికను సేవ్ చేశాడు. అలా ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు.
ఒక్కసారిగా మారిన ఓట్
తాజాగా ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో పేరున్న కంటెస్టెంట్లు లేరు. దీంతో తన టాలెంట్‌తో హైలైట్ అవుతోన్న నబీల్ ఆరంభం నుంచీ టాప్‌లో కొనసాగాడు. అలాంటిది ఒక్కసారిగా ఓటింగ్ మారిపోయింది. దీంతో ప్రేరణ టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. దీంతో నబీల్ రెండో స్థానానికి పడిపోయాడు. వీళ్ల మధ్య తక్కువ తేడానే ఉంది.

వాళ్లంతా సేఫ్ అవుతారు
ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారంలోని ఓటింగ్‌లో ప్రేరణ, నబీల్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. వీళ్లిద్దరి తర్వాత కూడా ఓటింగ్‌లో పెద్దగా ఎలాంటి తేడా కనిపించకుండానే ఈ వారం ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. నాగ మణికంఠ మూడో స్థానంలో ఉన్నాడు. అలా ఈ వారం ఈ మూడు స్థానాల్లో ఉన్న వీళ్లు వందకు వంద శాతం సేఫ్ అవుతారని చెప్పొచ్చు.

4వ వారం ఊహించనట్లు
నాలుగో వారం ఓటింగ్‌లో ఆదిత్య ఓం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. అలాగే అందరి కంటే చివర్లో అంటే ఆరో స్థానంలో సోనియా ఆకుల ఉంది. ఈ ఓటింగ్ ప్రకారం అయితే సోనియానే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఆమె వల్ల కంటెంట్ ఎక్కువ వస్తుందని బిగ్ బాస్ భావిస్తే ఊహించిన విధంగా పృథ్వీని కానీ, ఆదిత్యను కానీ పంపొచ్చు.


Click it and Unblock the Notifications











