Bigg Boss Telugu 8: అదిరిపోయే ట్విస్ట్ .. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. హౌస్‌లో అడుగుపెట్టేది ఎవరంటే?
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నెల రోజుల పాటు కాస్త చప్పగా.. సాగిన రియాల్టీ షోలో వైల్డ్ కార్డుఎంట్రీలు, డబుల్ఎలిమినేషన్స్ చేసి.. షో పై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేశారు. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దూసుకపోతోంది. రసవత్తరంగా సాగుతోన్న ఈ షోలో ఎనిమిదో వారం మరో బిగ్ అండ్ షాకింగ్ ట్వీస్ట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. అదే.. ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినా పర్సన్ ను రీ ఎంట్రీ పేరుతో హౌస్ లోకి తీసుకరాబోతున్నారు. ఇంతకీ ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరో ఓ లూక్కేయండీ.
గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో బిగ్ బాస్ సీజన్ 8 కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా
ఐదోవారం 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డు ఎంట్రీ అయినా వారిని రాయల్ క్లాన్ పేరు పెట్టగా.. పాత వారికి ఓజీ క్లాన్ అనే పేరు పెట్టారు. వీరిద్దరి మధ్య పోరు జోరుగా సాగుతోంది. ప్రతి టాస్క్ లో ఇరు క్లాన్ మెంబర్స్ చాలా టాప్ ఫైట్ ఇస్తున్నారు. ఏ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సీజన్ మరింత మసాలా జోడించాడానికి గత ఆరు వారాల్లో ఎలిమినేట్ అయినా వ్యక్తుల్లో ఒకరిని రీ ఎంట్రీ పేరిట.. మళ్లీ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నది. తాజా సమాచారం ప్రకారం.. సోనియా ఆకుల రీఎంట్రీ ఆల్‌మోస్ట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ కూడా సోనియాను కాంటాక్ట్ అయ్యిందట. అయితే .. రీఎంట్రీ ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై సోనియా కాస్త డైలామాలో ఉండట. ఓ ఇంటర్య్వూలో సోనియా మాట్లాడుతూ.. మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు తన పేరెంట్స్ అంగీకరించడం లేదని చెప్పిన విషయం తెలిసిందే. అందుకే రీ ఎంట్రీ విషయంపై మరోసారి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
రీ ఎంట్రీ ఇస్తే.. సోనియా ఈసారి కొన్ని కండీషన్స్ పెట్టే అవకాశం ఉంది. గతంలో ఆమెను కావాలని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేశారని, తనను బాడ్ గా చూపించేలా ప్రోమోలు,ఎపిసోడ్స్ కట్ చేశారంటూ సోనియా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ నెటిగివిటీని తగ్గించేలా చూసుకోవాలని, తనను పాజిటివ్ వేలో చూపించేలా కోరవచ్చు. ఎక్కవ శాతం.. సోనియా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలే ఎక్కువగ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 8 వ వారం సోనియా రీఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ఫార్మ్ అయిపోయిందంట.

మరోవైపు.. ఆదిత్య ఓం పేరు కూడా తెరపైకి వచ్చింది. మిడ్‌వీక్ ఎవిక్షన్ ఈవెంట్‌లో భాగంగా 5వ వారంలో బిగ్ బాస్ తెలుగు 8 షో నుండి ఎలిమినేట్ అయిన నటుడు దిత్య ఓం మళ్లీ హౌస్‌లోకి తీసుకవచ్చే అవకాశం కూడా ఉందట. ఆదిత్య ఓం ఐదు వారాల పాటు బిగ్ బాస్ లో ఉండి.. తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అందరీతో హుందాగా వ్యవహరించిన ఆదిత్య ఓం ను మరోసారి రీ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్ 7లో ఇలానే రతిక రోజ్ ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఆ తర్వాత ఆమెతో రీఎంట్రీ ఇప్పించిన విషయం తెలిసిందే. మరి వీరిద్దరిలో ఎవరూ రీ ఎంట్రీ ఇస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











