బట్టలు వేసుకోని అతడితో.. వద్దని చెప్తున్నా విష్ణుప్రియ వినలేదు: లేడీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. అందుకే నిర్వహకులు వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను కూడా మొదలు పెట్టారు. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ సీజన్‌లో ఎన్నో ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో విష్ణుప్రియపై ఓ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీరే చూడండి!

ఆసక్తికరంగా ఎనిమిదో సీజన్
బిగ్ బాస్ షో తెలుగులో ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకోవడంతో ఎనిమిదో దానిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సారి మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామంటూ నిర్వహకులు ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే అన్ని సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తూ షోను ఆసక్తిగా చూపిస్తున్నారు.

Sonia Akula Sensational Comments On Vishnupriyaa Bhimeneni in Bigg Boss Telugu 8 Show

రంజుగా నామినేషన్స్ టాస్క్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను కొత్తగా నిర్వహించారు. ముఖ్యంగా ఇప్పటికే హౌస్‌లో మూడు క్లేన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో తమ క్లేన్ కాకుండా పక్క క్లేన్ వాళ్లనే నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. ఈ టాస్క్‌లో భాగంగా నామినేట్ చేసే ఇద్దరిపై వాళ్లు రంగు నీళ్లు పోసి తగిన కారణాలు చెప్పాలని తెలిపాడు.

విష్ణుప్రియ వర్సెస్ సోనియా
గత వారంలో జరిగిన ఓ ఎపిసోడ్‌లో విష్ణుప్రియ 'మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు. మరి ఇప్పుడు ఎలా ఫ్రెండ్‌షిప్ కుదిరింది' అని సోనియాను ప్రశ్నించింది. దీనికామె 'ఎవరు అడగమన్నా నేను మాత్రం మీ అడల్డ్ (బూతు) కామెడీలో పార్ట్ కాను' అని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను చూసిన తర్వాత కూడా నాగార్జున విష్ణుప్రియదే తప్పు అన్నాడు.

అప్పటి గొడవను లాగిందిగా

తాజాగా జరిగిన నామినేషన్స్ టాస్కులో విష్ణుప్రియ గతంలో జరిగిన గొడవను లాగుతూ సోనియాను నామినేట్ చేసింది. అంతేకాదు, 'లాస్ట్ వీక్ జరిగిన దానికి నేను సారీ చెప్పాను. కానీ నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు. దానికి నాకు సారీ చెప్పలేదు' అని చెప్పింది. దీనికి సోనియా 'నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు. నాకు అది అడల్ట్రీనే' అంటూ వాదించింది.

పిల్లా బచ్చా జోకులకే ఎలా
సోనియా మాటలకు ఫైర్ అయిన విష్ణుప్రియ 'అసలు మీ దృష్టిలో నేను ఏం అడల్ట్రీ జోక్స్ వేశా' అంటూ సూటిగా అడిగేసింది. దీనికి సోనియా 'మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు' అని సమాధానం దాటవేసింది. దీంతో విష్ణు 'మీరు ఒకళ్లే తెలివైనోళ్లు కాదు. పిల్ల బచ్చా జోకులేస్తే దాన్ని అడల్ట్రీ అని ఎట్లా అంటారు' అనడంతో బరాబర్ అంటా అని సోనియా చెప్పింది.

బట్టలు సరిగా వేయకుండా

విష్ణు మాటలకు సహనం కోల్పోయిన సోనియా 'బట్టలు సరిగ్గా వేసుకోని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలీదు. ఆయన ఒకవైపు అన్ కంఫర్టబుల్ అంటున్నా కూడా ఆయన పక్కకే వెళ్లి నిల్చొని చేసిందంతా ఏంటి' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికామె 'అసలు ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్లు చెబుతారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యను కరెక్ట్‌గా వాడాలి' అంటూ కౌంటర్ వేసింది.

More from Filmibeat

Read more about: bigg boss telugu 8 sonia akula
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X