Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లో రొమాంటిక్ సీన్.. అలా చేస్తే ఏమడిగినా ఇస్తా అంటూ!

ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయమైనా.. చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న ఏకైక షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా తెలుగు వాళ్లు దీనికి భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా ఏడు సీజన్లు కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా సాగాయి. ఈ క్రమంలోనే గత నెలలో మొదలైన ఎనిమిదో సీజన్ కూడా అదే రేంజ్‌లో నడుస్తోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సోనియా.. నిఖిల్ మధ్య ఊహించని సీన్ ఒకటి జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే చూడండి!

అన్‌లిమిటెడ్ ట్విస్టులతో
బిగ్ బాస్ ఏడో సీజన్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఎనిమిదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీసుకు వచ్చారు. ఇందులో ఎన్నో ట్విస్టులు, షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఫలితంగా షోను ఆరంభం నుంచే రంజుగా మార్చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకులు దీనికి స్పందన అందిస్తున్నారు.

Sonia Akula Shows Huge Love on Nikhil Maliyakkal In Bigg Boss Telugu 8 Show

14 మంది.. ఆమె స్పెషల్

ఇప్పుడు నడుస్తోన్న ఎనిమిదో సీజన్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో సోనియా ఆకుల స్పెషల్ అట్రాక్షన్ అయింది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ చిన్నది.. రాంగోపాల్ వర్మ సినిమాలోనూ నటించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్‌లోకి వచ్చింది. ఇందులో ఆమె ఆరంభంలోనే తనదైన ప్రత్యేకతను చాటుకుంది.

అందంతో పాటు ఆటలో
ఎనిమిదో సీజన్‌లో సోనియా ఆకుల ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటోంది. ముఖ్యంగా ఈ చిన్నది మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో అందంగా తయారవుతూ అదుర్స్ అనిపిస్తోంది. అయితే, ఎదుటి వాళ్లపై దూకుడుగా వెళ్తూ టార్గెట్ చేయడం సోనియాను విమర్శలపాలు చేస్తోంది.

అతడితో క్లోజ్‌గా ఉంటూ

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే సోనియా ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, మాట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈమె ఆరంభం నుంచే నిఖిల్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఈ మధ్యన వీళ్లిద్దరూ మరింతగా క్లోజ్ అవుతూ హైలైట్ అవుతున్నారు.

గొడవలకూ కారణంగానే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో పెద్దగా లవ్ ట్రాకులు కనిపించడం లేదు. కానీ, సోనియా - నిఖిల్ కాస్త క్లోజ్‌గా కలిసి తిరుగుతున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని స్టార్ మా చూపిస్తోంది. ఇదే విషయంలో విష్ణుప్రియ టార్గెట్ అయిన సంగతి కూడా తెలిసిందే. కానీ, సోనియా, నిఖిల్ మాత్రం చాలా క్లారిటీగానే ఉన్నారు. దీంతో వీళ్ల ట్రాక్‌పై ఎన్నో వార్తలు వస్తున్నాయి.

ఏది అడిగినా ఇస్తానని

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సోనియా ఆకుల 'నువ్వు సిగరెట్ కాల్చడం మానేస్తే ఏది అడిగినా ఇస్తాను' అని నిఖిల్‌తో చెప్పింది. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. అప్పుడు అక్కడే ఉన్న వాళ్లు ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు. దీంతో వీళ్లిద్దరి నిజంగానే లవ్‌లో ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి వీళ్ల బంధం ఎక్కడికి వెళ్తుందో.. ఎలా మారుతుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X