Bigg Boss Telugu 8: లేడీ కంటెస్టెంట్ అసభ్య ప్రవర్తన.. ఆ పార్టులపై చేతులు వేసి దారుణంగా!
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఇది దాదాపు ఐదేళ్లుగా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందనను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిపోతోంది. తద్వారా టెలివిజన్ హిస్టరీలో ఉన్న ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని నడుపుతున్నారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కొన్ని షాకింగ్ సీన్స్ కనిపించాయి. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
అన్‌లిమిటెడ్‌కు తగ్గట్లుగానే
తెలుగులో గతంలో ప్రసారం అయిన బిగ్ బాస్ ఏడు సీజన్లు రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఎనిమిదో సీజన్‌ను నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా డిఫరెంట్ టాస్కులు, కొత్త రూల్స్‌తో వైవిధ్యంగా నడుపుతున్నారు.

లవ్ ట్రాకుల కోసం ఫ్యాన్స్
మిగిలిన షోలను కాదని ప్రేక్షకులు బిగ్ బాస్‌ను ఇష్టపడడానికి అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా కారణం అనే చెప్పాలి. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ అయ్యారు.
అంతా అనుకున్నట్లుగానే
బిగ్ బాస్ ఇంట్లో చుట్టూ వందల కెమెరాలు ఉన్నా.. చాలా మంది రొమాంటిక్‌గా కనిపిస్తూ తమ తమ ప్రేమలను వ్యక్త పరచుకుంటూ ఉండడం ప్రేక్షకులకు కావాల్సినంత మజాను పంచుతోంది. ఇక, ఎనిమిదో సీజన్‌లో ఇప్పటికే పలువురిని జంటలుగా చూపిస్తున్నారు. అందులో ఇద్దరు అబ్బాయిలతోనూ ఓ అమ్మాయి మాత్రమే పెయిర్‌లా మారి కనిపించడం అందరికీ షాకిస్తోంది.
ఇద్దరితోనూ క్లోజ్‌గా అంటే
తాజా సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఫీమేల్ కంటెస్టెంట్లలో సోనియా ఆకుల ఒకరు. హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే సోనియా ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, మాట తీరుకు చాలా మంది ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే నిఖిల్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పృథ్వీరాజ్‌తోనూ క్లోజ్‌గా ఉంటోంది. దీంతో ఈమెపై విమర్శలు వస్తున్నాయి.
నాలుగో సీజన్ మాదిరిగా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో సోనియా ఆకుల ఏకంగా నిఖిల్, పృథ్వీరాజ్ ఇద్దరితోనూ చనువుగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆమె ఇద్దరితోనూ హగ్గులు ఇచ్చుకోవడం, చేతులు పట్టుకుని కూర్చోవడం, మీద పడుకోవడం వంటివి చేస్తోంది. తద్వారా నాలుగో సీజన్‌లో మోనాల్, అఖిల్, అభిజిత్ ఇలాగే ఉండేవారని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అసభ్య ప్రవర్తనతో ట్రోల్
సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్‌లో ప్రవర్తించే తీరు వివాదాస్పదం అవుతోంది. తాజా ఎపిసోడ్‌లోనే ఆమె నిఖిల్ తొడలపై చేతులు వేసి కనిపించింది. అలాగే, మిడ్ నైట్ వాళ్లిద్దరూ డీప్ హగ్ చేసుకున్నారు. మరో సందర్భంలో పృథ్వీ చేతిని గట్టిగా పట్టుకుని కనిపించింది. ఇలా సోనియా ఇద్దరు మగాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications











