Bigg Boss Telugu 8 Nominations: కత్తులు దూసుకొన్న సోనియా, ప్రేరణ.. ఇంత చిల్లర గొడవలా?

బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో గ్రాండ్ ఆరంభమైంది. ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు పెట్టి వారి మధ్య చిచ్చు పెట్టడంలో సక్సెస్ అయ్యారు. అయితే తొలివారం నామినేషన్ ప్రక్రియలో సెలబ్రిటీలు తమ హోదాను మరిచి చిల్లరగా ప్రవర్తించడం.. తెచ్చిపెట్టుకొన్న కోపం.. ఆర్టిఫిషియల్ టెంపర్ గురించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తొలివారం ఎలిమినేషన్ కోసం బిగ్‌బాస్ నామినేషన్ల ప్రక్రియను క్రేజీగా ప్రారంభించారు. కెప్టెన్సీకి బదులుగా కొత్తగా పరిచయం చేసిన ముగ్గురు ఛీఫ్‌ల సమక్షంలో నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ముగ్గురు చీఫ్‌లు నైనిక, నిఖిల్, యశ్వీ గౌడ సమక్షంలో వ్యవహారం కొనసాగింది.

Sonia Akula Vs Prerana Khambam Big fight in Bigg Boss Telugu 8 first week Nominations

అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటిలో ఉండటానికి అర్హత లేని ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లు చెప్పి.. వారి ఫోటోలపై కత్తితో పొడవాల్సి ఉంటుంది అని గేమ్ రూల్ చెప్పారు. దాంతో సెలబ్రిటీలు తమ మనసులో ఉన్న అక్కసంతా చూపి.. షోను రచ్చ రచ్చ చేశారు. రెండో రోజే ఇలా ఉంటే.. రాను రాను పరిస్థితి ఏంటనే ఫీలింగ్‌ను కల్పించారు.

అయితే షో ప్రారంభమై రెండు రోజులు కూడా కాలేదు. ఇంటి సభ్యులు మాత్రం వారాలుగా ఇంటిలో ఉంటే.. అలాంటి విభేదాలను ప్రదర్శించారు. కత్తులు దూసుకొన్నంత పనిచేశారు. ప్రేరణ, సోనియా ఇద్దరు మాత్రం గొంతులు చించుకొని అరుచుకొన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా గొంతులు చించుకోవడం కనిపించింది.

ఇది నా నామినేషన్ అంటే.. సోనియా ఆకుల అంటే.. నేను మాట్లాడుతుంటే.. నీవు నోర్మూసుకొ అంటూ ప్రేరణ అన్నారు. అవసరం లేని ఆవేశాన్ని తెచ్చు పెట్టుకొని నామినేషన్స్ ప్రక్రియలో ప్రేరణ.. నీవు తప్పుగా అర్ధం చేసుకోంటే అది నా సమస్య కాదు అని పెద్ద పెద్దగా అరిచింది. ఓ దశలో నువ్వు ఎవరు చెప్పడానికి.. నేను ఫుల్ డే తీసుకొంటాను ఒకరిపై ఒకరు గట్టిగా వాగ్వాదం పెట్టుకొన్నారు.

నామినేషన్ ప్రక్రియలో సోనియా రెచ్చ గొడితే.. ప్రేరణ ఆ ట్రాప్‌లో పడిందా? అనే విధంగా కనిపించింది. ఈ వాదన సందర్భంగా వారి యాటిట్యూడ్ ఇంత దారుణంగా ఉంటుందా? అనే విధంగా కనిపించింది. ఇదే పరిస్థితి మణికంఠలోను కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X