ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న సిద్ధూ-సోనియా.. ముహూర్తం ఎప్పుడంటే?

యూట్యూబర్, నటి అయిన సోనియా సింగ్, నటుడు సిద్ధూ పవన్ పాపులర్ సెలబ్రిటీ కపుల్. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో కలిసి నటిస్తూ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే బంధాన్ని వివాహంతో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టాక్ షో 'కిస్సిక్ టాక్స్'లో సోనియా సింగ్ పాల్గొన్నారు. ఈ సమయంలో తన ప్రేమ, పెళ్లి, కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సోనియా యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా రౌడీ బేబీ,హే పిల్ల యూట్యూబ్ ఛానళ్లతో మంచి క్రేజ్ సంపాదించిన సోనియా..'విరూపాక్ష'సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో కామెడీ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడుదలైన 'నాగబంధం' సినిమాలో కూడా సోనియా కీలక పాత్రలో నటించారు.

Sonia Singh Reveals Wedding Date With Siddu Pawan Shares Marriage and Future Plans

తాజాగా జబర్దస్త్ వర్షా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కిస్సిక్ టాక్స్'(Kissik Talks) లో సోనియా పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమెను "సిద్ధూ-సోనియా పెళ్లి ఎప్పుడు?"అని ప్రశ్నించగా.."ఏమో.. పెళ్లయిపోయిందేమో.. నేను చెప్పట్లేదేమో" అని సోనియా అంటారు. అనంతరం అసలు విషయాన్ని వెల్లడిస్తూ "సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 1:45 గంటలకు మా పెళ్లి జరగనుంది" అంటూ డేట్‌తో పాటు ముహూర్తాన్ని కూడా ప్రకటించారు.

ఇంటర్వ్యూలో భాగంగా సోషల్ మీడియా గురించి కూడా సోనియాను ప్రశ్నించారు. "మీ ఫోటోలు, వీడియోలు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలా?" అని అడగగా, "అవన్నీ ఫ్రీగానే అందరికీ అందుబాటులో ఉంటాయి" అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. అలాగే భవిష్యత్ కుటుంబ జీవితంపై మాట్లాడుతూ.. "తెలిసిన వాళ్లు నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుడతారని చెప్పారు. అది నిజమవుతుందో లేదో తెలియదు కానీ, నేను మాత్రం ఆ రోజుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ తన మనసులోని కోరికను అభిమానులతో పంచుకున్నారు.

సిద్ధూతో కలిసి సంపాదించిన ఆస్తుల గురించి కూడా వర్ష ప్రశ్నించారు. "మీ ఇద్దరి దగ్గర మొత్తం ఎంత ఆస్తి ఉంది?" అని అడగగా, సోనియా మొదట "వైట్ ఆ.. బ్లాక్ ఆ?" అంటూ సరదాగా స్పందించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. "గత ఏడాది మేమిద్దరం కలిసి ఒక ఇల్లు కొనుగోలు చేశాం. అలాగే ఒక బెంజ్ కారు కూడా తీసుకున్నాం. అవి కొన్న సమయంలో మా గురించి ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ నిజానికి మేము వాటిని ఈఎంఐలపైనే కొనుగోలు చేశాం. అందులో ఎలాంటి ప్రత్యేక విషయం లేదు" అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.

ఈ వ్యాఖ్యలతో చాలా కాలంగా తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్న సోనియా సింగ్, పవన్ సిద్ధూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు స్పష్టమైంది. దీంతో అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు.. సెప్టెంబర్ 2 అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, అదే రోజున వివాహం చేసుకోబోతున్నారా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Read more about: jabardasth varsha sonia siddu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X