హైపర్ ఆది వల్లే జబర్దస్త్ నుండి బయటకు వచ్చా.. సౌమ్యరావ్ షాకింగ్ కామెంట్స్

Soumya Rao's Statement on Leaving Jabardasth: జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన టైమింగ్‌, కామెడీ సెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో పూర్తి మాట్లాడలేకపోయినా.. కొద్దికాలంలోనే తనదైన స్టైల్‌ను ఏర్పరుచుకుంది. అయితే ఆమె ఒక్కసారిగా షో నుంచి కనిపించకపోవడం గురించి చాలా కాలంగా ఊహాగానాలు వినిపించాయి. చాలా మందికి సౌమ్య రావ్ ఎందుకు వెళ్లిపోయిందో తెలియలేదు. తాజాగా సౌమ్య ఓ ఇంటర్వ్యూలో తన ఎగ్జిట్‌పై స్పష్టత ఇచ్చింది. ఈ తరుణంపై హైపర్ ఆదిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

జబర్దస్త్ నుంచి యాంకర్ సౌమ్య రావ్ ఆకస్మికంగా బయటకు రావడంతో ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా, "హైపర్ ఆది వల్లే సౌమ్యను తీసివేశారు" అనే ప్రచారం జరిగింది. అయితే, తాజా ఇంటర్వ్యూలో సౌమ్య ఈ రూమర్స్‌కు మొదటిసారి పూర్తి క్లారిటీ ఇచ్చింది. తన తొలగింపునకు హైపర్ ఆదికి ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. "పాపం హైపర్ ఆది నాకు ఎందుకు కారణం అవుతారు? స్టార్టింగ్ నుంచే ఆయన నన్ను సపోర్ట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆయనే ఆఫర్ ఇచ్చారు. డైరెక్టర్లు దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు" అంటూ సౌమ్య చెప్పింది. ఈ మాటలతో ఆది పేరు వినిపించే ప్రతి రూమర్‌కి తానే ముగింపు పలికింది.

Soumya Rao Breaks Silence on Jabardasth Exit Clears Rumors About Hyper Aadi

అంతేకాదు, షోలో తనపై బాడీ షేమింగ్ జరుగుతోందని, అందుకే వెళ్లిపోయిందనే వార్తపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. "అది పూర్తిగా రూమర్. ఇలాంటి కామెడీ షోలలో పంచ్‌లు సహజం. ఎంటర్టైన్‌మెంట్ కోసం చేసే మాటలు అవి.. అవమానపరచడానికేమీ కాదు. సెట్‌పై ఆది నాకు ఎలా బిహేవ్ చేయాలో నేర్పారు. స్టేజ్ మ్యానర్స్ ఆయన దగ్గర నేర్చుకున్నాను. నాకు బాడీ షేమింగ్ కు తో ఇబ్బందిపడ్డాను అనేది పూర్తిగా తప్పు" అని సౌమ్య చెప్పారు. కామెడీ, వినోదం అనే కన్సెప్టును సరిగ్గా అర్థం చేసుకోవాలని, కొన్ని సందర్భాల్లో సిట్యుయేషన్‌ను ఓపెన్‌గా తీసుకోవాలని ఆమె గుర్తుచేశారు.

షోలో జరిగిన మరొక సంఘటన రోహిణి ఎపిసోడ్‌పై కూడా సౌమ్య స్పందించింది. రోహిణిని "దిష్టిబొమ్మ" అని ఎగతాళి చేసే కామెడీ సీన్‌లో తాను కొంత అసౌకర్యంగా ఫీలయ్యానని వెల్లడించింది. "ఆ సమయంలో భాషాపరమైన లిమిటేషన్లు ఉండటంతో ఆ సీన్‌ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. కావాలనే నన్ను ఇలా చేస్తున్నారా? నా మీద పంచులు వేస్తున్నారా? అని కాసేపు అనిపించింది. కానీ షూట్ పూర్తయ్యాక అందరూ వచ్చి 'ఇది కామెడీ మాత్రమే' అంటూ క్లియర్ చేశారు. అప్పుడు రిలాక్స్ అయ్యాను" అని తెలిపారు. కామెడీ షోలో పరస్పర మాటాప్రతిమాటల్ని వ్యక్తిగతంగా తీసుకోరాదని స్పష్టం చేశారు.

ఇక సౌమ్య తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. "నేను సాధారణంగా ఎప్పుడూ కూల్‌గానే ఉంటా. సెట్‌లో ఎవరు ఇబ్బంది పెడితే మాత్రం కాస్త సీరియస్‌గా వార్నింగ్ ఇస్తా. అంతే" అని చెప్పింది. అనసూయను రీప్లేస్ చేసిన విషయం గురించి అడిగితే, ఆమె చేసిన కొన్ని యాంకరింగ్ ఎలిమెంట్స్‌ను మాత్రమే రిఫర్ చేసానని, కానీ తన స్టైల్ మాత్రం పూర్తిగా ఒరిజినల్ అని చెప్పింది. "వాళ్లు ఇండస్ట్రీ సీనియర్స్. వారి కాంటాక్ట్స్ వేరే లెవెల్. నా పాయింట్ ఆఫ్ అట్ట్రోచ్ వేరే" అని సౌమ్య వివరించింది.

ఇంకా అనసూయే తాను ఇండస్ట్రీకి వచ్చానని వచ్చిన ప్రచారాన్ని సౌమ్య కొట్టిపారేసింది. "అనసూయ ఎవరో నాకు మొదట్లో తెలియదు. ఆ తర్వాత ఈవెంట్లలో కలుసుకున్నాం, పరిచయం పెరిగింది. ఆమె వల్ల నేను షోలోకి వచ్చానని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారం" అని తేల్చి చెప్పింది. జబర్దస్త్‌కు తిరిగి రావాలనే ఆహ్వానం ఉందా? అనే ప్రశ్నకు కూడా ఆమె స్పష్టంగా సమాధానం ఇచ్చింది.

"నా అగ్రిమెంట్ ముగిసిపోయింది. నేను స్వయంగా ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. ఎవరైనా నిజాయితీగా ఆఫర్ చేస్తే మాత్రమే చేస్తా. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయగల మనస్సు నాకు ఉంది" అని సౌమ్య తెలిపారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి సౌమ్య వెళ్లడానికి పరోక్షంగా హైపర్ ఆది కారణమని చెప్పవచ్చు. మొత్తానికి సౌమ్య రావ్ తన ఎగ్జిట్‌పై నెలలుగా కొనసాగుతున్న రూమర్స్‌కు పూర్తి క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Read more about: jabardasth hyper aadi soumya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X