సుడిగాలి సుధీర్ అలాంటోడే… అమ్మాయిలు కనిపిస్తే చాలు… యాంకర్ షాకింగ్ కామెంట్స్
బుల్లితెర కమెడియన్ కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. మల్టీ టాలెంటెడ్ యాంకర్ కు భారీ క్రేజ్ ఉందని చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్‌గా చిన్న చిన్న స్కిట్స్‌తో మొదలైన ప్రయాణం... ఈ రోజుకి హీరోగా ఎదిగారు. టీవీపైనే కాదు, సిల్వర్‌స్క్రీన్‌పైన కూడా తనదైన ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. జబర్దస్త్ ముందు మ్యాజిక్ షోలతో ఎంటర్‌టైన్ చేసిన సుధీర్, ఆ తరువాత జబర్దస్త్ వేదికపై అడుగుపెట్టడంతో ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించాడు. మొదటిప్పుడు కమెడియన్‌గా కనిపించిన ఆయన, తన కామెడీ టైమింగ్, ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్‌తో బలమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇలాంటి సుధీర్ పై యాంకర్ సౌమ్యరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?
సుడిగాలి సుధీర్ మొదట మ్యాజిక్ షోలతో గుర్తింపు తెచ్చుకున్నా, 'జబర్దస్త్' ద్వారా అసలైన పాపులారిటీ అందుకున్నాడు. కామెడీ టైమింగ్, ఎనర్జీతో త్వరగానే టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ఈ కామెడీ షో క్రేజ్‌తో సినిమాలకూ అడుగుపెట్టారు సుధీర్. మొదట చిన్న పాత్రలు చేసి, తర్వాత ఏర్ ఐ విద్యా బాలన్, సాప్ట్ వేర్ సుధీర్, వాటెండ్ పండుగాడు, కాలింగ్ సహాస్ర వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. ఇప్పుడు G.O.A.T అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన ఈ జర్నీ గ్రేట్ అనే చెప్పాలి.

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కామెడీ ఆర్టిస్ట్ సౌమ్యరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ టీమ్, తెలుగు ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మిపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ సౌమ్యరావు. ముందుగా టాలీవుడ్‌లో తన జర్నీ గురించి చెప్పుకుంటూ తాను వ్యక్తిగతంగా హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండే వ్యక్తి కాదని, షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్‌కి వస్తానని తెలిపారు. మిగతా సమయాల్లో బెంగళూరులోనే సెటిల్ అయ్యి ఉండే తనకు హైదరాబాద్‌లో స్నేహితులు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారని చెప్పారు. షూటింగ్ పూర్తయ్యాక వెంటనే తిరిగి బెంగళూరుకే వెళ్లిపోతానని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రొడక్షన్ టీం ఏర్పాటు చేసే అకామిడేషన్‌లో హైదరాబాద్లో ఉండేవారిని వెల్లడించారు.
జబర్దస్త్ టీం గురించి మాట్లాడిన సౌమ్య.. తనతో పని చేసిన ఆర్టిస్టులందరితో కూడా తనకు మంచి ప్రోత్సహం లభించిందని చెప్పారు. షో ఆపేసిన తర్వాత వారిని మిస్ అవుతున్నానని, ముఖ్యంగా సెట్‌లోని ఆ వాతావరణం గుర్తొస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంలో యాంకర్ రష్మీ-సుధీర్ జంట గురించి అడగగా, "వారి గురించి నాకు పెద్దగా పరిచయం లేదు. వ్యక్తిగత విషయాలు అంతగా తెలియవు," అంటూ క్లియర్‌గా జవాబిచ్చారు.
అయితే సుధీర్,హైపర్ ఆది విషయానికి వస్తే..తన కెరీర్ ప్రారంభంలో ఈ ఇద్దరూ చాలా సపోర్ట్ చేశారని, కొత్తగా వచ్చిన ఆర్టిస్టుగా ఉన్నప్పుడు తమదైన రీతిలో తనని ప్రోత్సహించారని చెప్పారు. "ఇతర కార్యక్రమాలకు కూడా రికమండ్ చేసి, ప్రమోట్ చేశారు," అంటూ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక సుధీర్ గురించి సౌమ్య రావు మాట్లాడుతూ.. ఆన్ స్క్రీన్ అమ్మాయిలతో సరదాగా కనిపించే సుధీర్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా మంచిగా గౌరవంగా ఉంటారని తెలిపారు. ఇక సుధీర్ నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారని అతను చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటూ సౌమ్య రావు కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సుధీర్ పై సౌమ్య రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











