Karthika Deepam పిల్లల కోసం బతకాలనే ఆశ.. కానీ ఆయన నా బతుకు మధ్యలోనే తుంచేస్తున్నారే.. కార్తీక్‌పై దీప ఫైర్

దాదాపు 1000 ఎపిసోడ్స్‌పైగా కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్‌లో భావోద్వేగాలు కొనసాగుతున్నాయి. వంటలక్కగా సుపరిచితులైన దీప ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం ఇంటి సభ్యుల్లో ఆందోళన వ్యక్తవవుతున్నది. సౌందర్యను బతికించుకోవడానికి అత్త సౌందర్య, తండ్రి మురళీకృష్ణ చేస్తున్న ప్రయత్నాలు ఎమోషనల్‌గా కనిపించాయి. 1011 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

దీప అనారోగ్యంపై తండ్రి బెంగ

దీప అనారోగ్యంపై తండ్రి బెంగ

దీప నీ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి డాక్టర్‌కు చెబితే ఆయన మందులు రాసిచ్చారు. మెడిసిన్ వాడితే ఆరోగ్య మెరుగుపడుతుందని చెప్పారు. క్రమం తప్పకుండా మందులు వాడమని చెప్పాడు అని తండ్రి మురళీకృష్ణ అంటే.. మంచి పని చేశారు. నేనే కార్తీక్ చెప్పి మంచి ట్రీట్‌మెంట్ చేయించాలని అనుకొంటున్నాను అంటూ సౌందర్య చెప్పారు. దాంతో ఆ డాక్టర్ కూడా కార్తీక్ బాబు లాంటి పెద్ద డాక్టర్ అంటూ మురళీ కృష్ణ సమాధానం ఇచ్చారు.

డాక్టర్ రాసిచ్చారా? డాక్టర్ బాబు రాసిచ్చారా?

డాక్టర్ రాసిచ్చారా? డాక్టర్ బాబు రాసిచ్చారా?

మందుల ఎలా వేసుకోవాలో చెబుతున్న తండ్రిని అడుగుతూ.. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ ఇవ్వండి అని దీప అడిగింది. దాంతో తండ్రి మురళీకృష్ణ తడబడుతూ మెడికల్ షాపులో మరిచిపోయాను. రేపు వెళ్లి అడిగి తీసుకొస్తాను. అయినా ఎందుకు నాకు అన్నీ గుర్తున్నాయి అంటూ మురళీ కృష్ణ జవాబు ఇవ్వబోగా.. రాసిచ్చారా.. ఆయన ఇచ్చారా.. ఇచ్చింది డాక్టరా? డాక్టర్ బాబా? ఇంకా ఏమేమీ జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ బాబు చెప్పారా అంటూ వంటలక్క దీప ప్రశ్న వేసింది.

ఇంట్లోనే చస్తూ బతుకుతుండాలా?

ఇంట్లోనే చస్తూ బతుకుతుండాలా?


ఇల్లు వదలారాదు.. పరువు తీయరాదు.. ఇడ్లీ బండి పెట్టి పరువు తీయవద్దు. ఇంట్లోనే మందులు మింగుతూ చస్తూ బతుకుతూ ఉండాలా? అంటూ దీప ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో తండ్రి మురళీకృష్ణ ఆమె మాటలకు అడ్డుపడుతూ.. డాక్టర్ బాబును ఎప్పటి నుంచి నమ్మడం మానేశావమ్మా. అంటూ ప్రశ్నించారు. వీరిద్దరి మధ్యలో జోక్యం కల్పించుకొంటూ సౌందర్య.. ఇవన్నీ పట్టించుకోవడం మానేసి మందులు వాడమ్మా అంటూ హితవు చెప్పింది. దానికి దీప సమాధానంగా మాట్లాడుతూ.. మందులు వాడితే ఏం జరుగుతుందో చెప్పమ్మా.. నా ఆరోగ్యంతోపాటు నాబతుకు కూడా బాగుపడుతుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

నన్ను జీవచ్ఛవంలా మార్చాడంటూ

నన్ను జీవచ్ఛవంలా మార్చాడంటూ

నా గుండె మండిపోతున్నది. ఇప్పుడు మందులు వేసుకోమంటే ఎలా.. మీ అల్లుడు నీకు మందులు కొనిచ్చినప్పుడు.. మీ భార్యకు మీరే ఇవ్వ వవచ్చు కదా? ఎందుకు ఇక్కడకు తెచ్చారని అడిగారా? మా అల్లుడు దేవుడు అంటూ మందులను ఇక్కడికి పట్టుకొచ్చారా? ఈ రోగం నన్ను పట్టి పీడించడానికి కారణం ఒంట్లో సత్తువ లేకపోవడం కాదు.. నా రోగానికి కారణం ఆయనే. ఆ మనిషి అన్న మాటలే నన్ను జీవచ్ఛవంలా చేస్తున్నాయి అంటూ దీప అగ్గి మీద గుగ్గిలం అయింది.

పిల్లల కోసం బతకాలనే ఆశ

పిల్లల కోసం బతకాలనే ఆశ

దాంతో నీ కోసం కాకపోయినా.. నీ పిల్లల కోసమైనా మందులు వేసుకో.. అంటూ తండ్రి మురళీకృష్ణ చెప్పగానే.. ఆపండి నాన్న.. అంటూ దీప ఎదురు ప్రశ్నించింది. పిల్లలు పిల్లలు అంటూ మధ్యలో వాళ్లను ఎందుకు తెస్తారు. పిల్లల కోసం నాకు బతకాలనే ఆశ ఉంది. కానీ ఆశను మధ్యలోనే ఆ మనిషి తుంచేస్తున్నాడే. నాకు ఏ మందులు అవసరం లేదు అత్తయ్య. జాలితోనో, దయతోనో కట్టుకొన్న భార్యకు ఉచితంగా వైద్యం చేయవద్దని చెప్పండి. అలాంటి ఔదార్యాన్ని తట్టుకొనే గుండె నిబ్బరం నాకు లేదు అంటూ దీప ఆవేశంలో మాట్లాడింది.

బండరాయిలా బతకడం కష్టం

బండరాయిలా బతకడం కష్టం

ఇక అత్తయ్య మీరు ఏమి చెప్పకండి.. పదేళ్లు మీ మాట విన్నాను. తిడితే ఓపికపట్టుకోమంటే అది చేశాను. చెంపదెబ్బ కొడితే సహించాను. కానీ బండరాయి బతికున్నతకాలం ఉండమని చెప్పకండి అత్తయ్య. అది నీకు న్యాయం కాదు అంటూ అంటూ సౌందర్యను దీప కడిగేసింది. అయితే కార్తీక్‌లో మార్పు వస్తున్నది. త్వరలోనే మీరు కలిసిపోతారు అంటూ సౌందర్య సర్ది చెప్పడం కనిపించింది. దీప అనారోగ్యం విషయం ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X