‘ఆ హీరోయిన్ నా మీదకి కారెక్కించి... ఒళ్లంతా రక్తంతోనే హీరో ఇంటికెళ్లా’

తెలుగు ఇండస్ట్రీలో కన్నడ నటీనటుల డామినేషన్ పెరుగుతోంది. సినిమాలే కాదు.. బుల్లితెరపైనా వారిదే హవా. హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా అన్ని రకాల పాత్రలకు బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక తెలుగు టీవీ ఛానెల్‌కు యాంకర్‌గా కన్నడ అమ్మాయి వ్యవహరించడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరో కాదు.. సౌమ్యారావు నడిగ్. తెలుగు వారి టాప్ కామెడీ షో జబర్దస్త్‌కు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకుంది. తెలుగు అంతగా రాకపోయినా తన అందం, సమయస్పూర్తితో బాగానే నెట్టుకొచ్చింది. అయితే అనూహ్యంగా జబర్దస్త్‌ను వీడింది సౌమ్యారావు. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చిన ఆమె.. తన జీవితంలో జరిగిన సంఘటనలను పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని షిమోగాకు చెందిన సౌమ్యారావు తమిళ బుల్లితెరపై రోజా అనే సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చారు. నెంజామ్ మరప్పదిళ్లై, వల్లి, మిన్నాలే, తిరుమతి హిట్లర్ తదితర సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు సౌమ్యారావు. ఈ క్రమంలో శ్రీమంతుడు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతలోనే స్టార్ యాంకర్ అనసూయ తప్పుకోవడంతో జబర్దస్త్‌కు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం సౌమ్యారావుకు దక్కింది. తనపై ఎంతగా ట్రోలింగ్ జరిగినా సరే.. ఎంతో కష్టపడి జబర్దస్త్‌కు యాంకర్‌గా చేసింది. అయితే అనుకోకుండా ఆమె ఈ షో నుంచి తప్పుకున్నారు. ఆమె సడెన్ ఎగ్జిట్‌పై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా కిస్సిక్ టాక్ షోలో సౌమ్యారావు మాట్లాడుతూ...

Sowmya Rao Nadig Opens Up About Jabardasth Exit Career Struggles and Shocking Accident

ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఆర్టిస్ట్ ఎన్నో ఆశలతోనే వస్తారు. కానీ అదృష్టం అనేది ఇక్కడ చాలా ముఖ్యం.. టాలెంట్ ఒక్కటే సరిపోదు. జబర్దస్త్‌లో అవకాశం పోయిన తర్వాత ఇది కాకపోతే మరొకటి అనుకున్నా. ఇంత సంపాదిస్తున్నా.. ఒక్కొక్కసారి నాకు పాకెట్ మనీకి కూడా డబ్బులు ఉండవు. నా ఖర్చులన్నీ నేనే భరించుకుంటాను, ఒకసారి షో వస్తే ఒకే లేదంటే 6 నెలలు ఇంట్లో ఉండాల్సి వస్తే డబ్బులు కావాలి కదా. నేను ఫస్ట్ న్యూస్ రీడర్‌గా పనిచేశా.. అది అయిన తర్వాత యాంకర్‌గా వర్క్ చేశా. మార్నింగ్‌ ఒక ఛానెల్‌లో, మధ్యాహ్నం ఇంకొక ఛానెల్‌లో.. సాయంత్రం మరో ఛానెల్ చొప్పున ఒక్కరోజులో పనిచేసిన రోజులున్నాయని సౌమ్యారావు గుర్తుచేసుకున్నారు.

నాకు ఎవరూ కూర్చోబెట్టి పెట్టలేదు.. నేను కాలేజీ నుంచే నా డబ్బు నేను సంపాదించుకోవడం నేర్చుకున్నా. జీవితంలో నాకు ఏది ఊరికే రాలేదు. ఒక రోజున నేను పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. కాలుకి పెద్ద గాయమైంది.. రోడ్డంతా రక్తంతో తడిసిపోయింది. జనమంతా గుమిగూడి నన్ను ఆసుప్రతికి తీసుకెళ్దామని అనుకుంటుండగా.. నేను మాత్రం అక్కడి నుంచి డైరెక్ట్‌గా హీరో ఇంటికి వెళితే ఆయన కంగారుపడుతూ ముందు ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. ఆ టైంలో ఆ షూట్ నాకు చాలా ఇంపార్టెంట్.. అది వదులుకుంటే నా ప్లేస్‌లో ఇంకేవరో వస్తారోనని భయపడ్డానని సౌమ్యారావు తెలిపారు.

ముక్కుసూటిగా ఉండి చాలా అవకాశాలు పొగొట్టుకున్నా.. సెట్‌లో ఎవరున్నాసరే బాలేదంటే బాలేదని చెప్పేసేదానిని. సీరియల్స్‌లో నెగిటివ్ రోల్స్ చేసేవారిని ఒకరకంగా, హీరోయిన్లుగా చేసేవారిని మరో రకంగా ట్రీట్‌ చేస్తుంటారు. నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ నడిచేది. కానీ వాళ్లకి గొడవలు అవుతున్నాయట.. తర్వాత వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆ హీరోయిన్ షూటింగ్ మీద చూపించేది. ఆ సీరియల్‌కు చాలా టాప్ రేటింగ్ ఉండేది. ఒకరోజున షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఆ హీరో వచ్చి నాతో మాట్లాడుతుండగా... ఆ హీరోయిన్ కారు వేసుకొచ్చి హారన్ కొట్టింది. ఆయన వస్తున్నానని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా కారులో వెళ్లిపోయింది. ఆ కాసేపటికీ నా దగ్గరికి వచ్చి.. నీకు ఎంతమంది కావాలంటూ గొడవ పెట్టుకుంది. నేను మూస్కుని పొమ్మనడంతో ఆమె కారును రివర్స్‌లో తీసుకొచ్చి నన్ను గుద్ధింది. సీరియల్‌లో ఎంతో మంచిగా కనిపించిన ఆ అమ్మాయి.. రియల్ లైఫ్ లో సైకోగా బిహేవ్ చేసిందని సౌమ్యారావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X