ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా వెనుక అసలు కారణం అదే.. మరో 20 మందికి కూడా అంటూ!
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఆయన కరోనా బారిన పడటానికి అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమే కారణమనే వాదనలు మీడియాలో వస్తున్నాయి. ఇటీవల జరిగిన కార్యక్రమ షూటింగ్‌లో పాల్గొన్న వారికి కూడా భారీ సంఖ్యలో కరోనావైరస్ సోకిందనే మాట వినిపిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎస్పీబీతోపాటు మరో 20 మందికి
గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం హోస్ట్‌గా నిర్వహించే అత్యంత ప్రజాదరణ సంగీత కార్యక్రమం షూటింగ్ ఇటీవల జరిగింది. ఆ షోలో ఎస్పీబీతోపాటు చాలా మంది గాయకులు పాల్గొన్నారు. ఆ రోజు షూటింగులో పాల్గొన్న వారిలో దాదాపు 20 మందికి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ కార్యక్రమం వల్లే బాలు అస్వస్థతకు గురయ్యారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

ప్రజాదరణ పొందిన షోలో చాలా మందికి కరోనా పాజిటివ్
ఆగస్టు మొదటి వారంలో జరిగిన షూటింగులో పాల్గొన్న గాయకుల్లో చాలా మందికి పాజిటివ్ వచ్చింది. ఆ షో నిర్మాతకు, కీలక సభ్యులకు కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో స్వీయ గృహ నిర్బంధంలోకి చికిత్స పొందున్నట్టు సమాచారం. ఓ ప్రముఖ గాయని, ఆమె కూతురుకు కూడా కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వారందరూ ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలోనే చికిత్స పొందుతున్నట్టు తెలుస్తున్నది.

టెలివిజన్ ఇండస్ట్రీని వెంటాడుతున్న కోవిడ్ 19
తెలుగు సినిమా పరిశ్రమలో కోవిడ్19 నిబంధనలు సడలించిన తర్వాత టెలివిజన్ షోల షూటింగులు ఊపందుకొన్నాయి. ఆ తర్వాత చాలా మంది కరోనావైరస్ బారిన పడ్డారు. సినిమా షూటింగులు ఇంకా చేపట్టకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు తలెత్తలేదని, కేవలం బుల్లితెర నటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కరోనా బారిన పడటం గమనార్హం.
Recommended Video

ధైర్యంతో వెళ్లి.. విషమ పరిస్థితిలో ఎస్పీబీ ఆరోగ్యం
ఇక బుల్లితెర కోసం ఎస్పీబీ చేసిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో గాయకులు, టెక్నిషియన్సు పాల్గొన్నారనేది తాజా సమాచారం. ఆ తర్వాత ఆగస్టు 5వ తేదీన తనకు కరోనా వైరస్ పాజిటివ్ అనే విషయాన్ని స్వయంగా బాలసుబ్రమణ్యం వీడియో ద్వారా వెల్లడించారు. కరోనావైరస్ సోకినప్పటికీ ఆయన మనోధైర్యంతో తిరిగివస్తానని చెప్పారు. కానీ హాస్పిటల్‌లో చేరిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడం అందర్నీ ఆవేదనకు గురిచేస్తున్నది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తు్నారు.


Click it and Unblock the Notifications











