దాసరికి..ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం షాక్

అయితే దాసరికి షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేసారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. డబ్బింగ్ సీరియళ్లకు అనుకూలంగా ఆయన మాట్లాడారు. లోకల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉపాధిపై డబ్బింగ్ సీరియళ్లు పెద్దగా ప్రభావం చూపవనేదే తన అభిప్రాయమని, ఆందోళన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు దాసరికి షాకిచ్చినట్లయ్యాయని ఫిల్మ్ నగర్ టాక్.
డబ్బింగ్ సీరియళ్ల వల్ల తమ ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని, వాటి జోరుకు కళ్లెం వేయక పోతే తామంతా రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీవీ ఆర్టిస్టులు. తెలుగు భాషను, తెలుగు కళాకారులను, తెలుగు సీరియళ్లను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందని, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అన్ని ఛానల్స్ డబ్బింగ్ సీరియల్స్ ఆపివేసినా....మాటీవీ వారు ఆపకపోవడంతో ఇటీవల కొందరు ఆ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











