ఫిక్సైన యాంకర్ ప్రదీప్ పెళ్లి: గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ ప్లాన్స్‌.. సీనియర్ సింగర్ వల్ల లీకైన మేటర్

తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్లు హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తనదైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరించడంతో పాటు వరుసగా షోలు మీద షోలు చేస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా సత్తా చాటుతోన్నాడు ప్రదీప్ మాచిరాజు.

సుదీర్ఘ కాలంగా తనదైన ముద్రను చూపిస్తూ ముందుకెళ్తోన్న అతడు.. సినిమాల్లోనూ యమ సందడి చేస్తోన్నాడు.ఇదిలా ఉండగా ప్రదీప్ పెళ్లిపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సింగర్ శైలజ అతడి గురించి షాకింగ్ న్యూ చెప్పారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీరే చూసేయండి!

SP Sailaja Comments on Anchor Pradeep Machiraju Marriage

అప్పుడే నంది అవార్డుతో: రేడియో జాకీగా కెరీర్‌ను మొదలు పెట్టిన ప్రదీప్.. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అయిన ఓ షో ద్వారా యాంకర్‌గా మారాడు. అలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ప్రదీప్ 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే గేమ్‌ షోతో ఎనలేని క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు. అదే సమయంలో బెస్ట్ యాంకర్‌గా నిలిచి.. నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

బుల్లితెరపై ప్రదీప్ హవా: జీ తెలుగు చానెల్ ద్వారా వచ్చిన ప్రదీప్ మాచిరాజు.. ఆ తర్వాత వేరే వాటిలోకి కూడా ప్రవేశించాడు. అలా ఎన్నో రకాల షోలను హోస్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ యంగ్ టాలెంటెడ్ యాంకర్ వరుస షోలతో సందడి చేస్తోంది. అందులో 'ఢీ 15', 'జీ సూపర్ ఫ్యామిలీ', 'లేడీస్ అండ్ జెంటిల్‌మన్' సహా పలు షోలు, ఈవెంట్లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారాడు.

SP Sailaja Comments on Anchor Pradeep Machiraju Marriage

హీరోగా బిగ్ హిట్ కొట్టేసి: అదిరిపోయే హోస్టింగ్‌తో బుల్లితెరపై టాప్ యాంకర్‌గా హవాను చూపిస్తోన్న ప్రదీప్.. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా వచ్చాడు. క్రేజీగా విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్లతో బంపర్ హిట్ కొట్టేసింది.

ఆ షోలో నెక్ట్స్ లెవెల్‌లో: ఇప్పటికే యాంకర్ ప్రదీప్ మాచిరాజు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం కాబోతున్న 'సరిగమప ఛాంపియన్‌షిప్' అనే సింగింగ్ షోలో అలరిస్తున్నాడు. ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్న ఈ షోలో సరిగమప సీజన్లలోని కొందరు టాప్ సింగర్లను నడిపిస్తున్నారు. ఇందులో ప్రదీప్ నెక్ట్స్ లెవెల్‌లో అలరిస్తున్నాడు.

SP Sailaja Comments on Anchor Pradeep Machiraju Marriage

యాంకర్ ప్రదీప్ పెళ్లిపై: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. సుదీర్ఘ కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రదీప్ పెళ్లి చేసుకోనని చెప్పినా కూడా ఈ ప్రచారాలు మాత్రం ఆగడం లేదు.

ఫిక్సైన ప్రదీప్ మ్యారేజ్: ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడి పెళ్లి ఫిక్స్ అయిందట. ఈ విషయాన్ని లెజెండరీ సింగర్ ఎస్పీ శైలజ వెల్లడించారు. తాజాగా 'సరిగమప' షోలో పాల్గొన్న ఆమె.. 'నాకు చాలా ఆనందకరమైన విషయం ఏమిటంటే.. యాంకర్ ప్రదీప్‌కు పెళ్లి కుదిరింది' అని చెప్పుకొచ్చారు.

ప్రీ వెడ్డింగ్ ప్లాన్ అంటూ: అసలు విషయం ఏమిటంటే.. సరిగమప షోలో వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో ఎస్పీ శైలజ.. యాంకర్ ప్రదీప్ పెళ్లి సెట్ అయినట్లు చెప్పారు. అంతేకాదు, ప్రీ వెడ్డింగ్ ప్లాన్స్‌లో భాగంగా మ్యూజిక్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ప్రదీప్ 'నా పెళ్లి గురించి నాక్కూడా తెలీదు మేడం. అమ్మాయి ఎవరో నాక్కూడా చెప్పండి' అని రియాక్ట్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X