బిగ్ బాస్ హౌస్‌లోకి ఊహించని అతిథి: ఎన్టీఆర్ సీజన్‌లో ఎంట్రీ.. మళ్లీ ఇప్పుడు రాక!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా ఎన్నో రికార్డులకు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లు ఇదే తరహా ఫలితాన్ని అందుకున్నాయి. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం అదే విధంగా సాగుతోంది. ఇలాంటి షోలో మరింత ఆసక్తిని పెంచేందుకు షో నిర్వహకులు సరికొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఊహించని అతిథిని తీసుకొచ్చారు. ఇంతకీ ఎవరా గెస్ట్? పూర్తి వివరాల్లోకి వెళితే..

అదరగొడుతోన్న నాలుగో సీజన్

అదరగొడుతోన్న నాలుగో సీజన్

తెలుగులో బిగ్ బాస్ షో ఏకంగా మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నాలుగో సీజన్‌ను సైతం మొదలెట్టారు నిర్వహకులు. రెండు నెలల క్రితం మొదలైన ఈ సీజన్‌కు కూడా తెలుగు ప్రేక్షకులు మద్దతు తెలుపుతున్నారు. ఫలితంగా ప్రీమియర్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయి రేటింగ్ లభించడంతో పాటు షో కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

వంద శాతం ఇచ్చేందుకు ప్లాన్లు

వంద శాతం ఇచ్చేందుకు ప్లాన్లు

గతంలో కంటే ఈ సారి ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామని ఈ సీజన్ ముందు నుంచే బిగ్ బాస్ నిర్వహకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ప్రతి విషయాన్ని పక్కాగా ప్లాన్ చేసి అమలు చేస్తున్నారు. ఫలితంగా వందకు వంద శాతం వినోదాన్ని పంచుతున్నారు. ఈ కారణంగానే నాలుగో సీజన్ రోజురోజుకూ ఆసక్తికరంగా ప్రసారం అవుతోంది.

వాటి కంటే ఇదే స్పెషల్ అనేలా

వాటి కంటే ఇదే స్పెషల్ అనేలా

ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లు ఒకెత్తు.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్నది మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది బిగ్ బాస్ షో. దీనికి కారణం గత సీజన్లలో చూడని ఎన్నో అంశాలు ఇప్పుడు కనిపిస్తుండడమే. టాస్కులతో పాటు వారం మధ్యలో కొన్ని సర్‌ప్రైజ్‌లు.. నామినేషన్ ప్రక్రియలతో పాటు ఎన్నో కొత్త పరిణామాలు ఈ సీజన్‌ను స్పెషల్‌గా నడిపిస్తున్నాయి.

 తొలిసారి పరిచయం చేశారుగా

తొలిసారి పరిచయం చేశారుగా

గత సీజన్లలో కనిపించని ఎన్నో కొత్త అంశాలు ఇందులో వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్' అనే కొత్త పద్దతిని పరిచయం చేశారు. దీని వల్ల ఈ సారి నామినేట్ అయిన సభ్యుల్లో ఒకరు ఇమ్యూనిటీ పొందుతారు. రెండు వారాల్లో ఎప్పుడైనా దీన్ని వాడుకోవచ్చు. ఈ టాస్కులో అవినాష్.. అఖిల్‌పై గెలుపొందాడు.

బిగ్ బాస్‌లోకి ఊహించిన అతిథి

బిగ్ బాస్‌లోకి ఊహించిన అతిథి

ఆసక్తికరంగా సాగుతోన్న బిగ్ బాస్ షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వహకులు ఎంతగానో శ్రమిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్పెషల్ సర్‌ప్రైజ్‌లతో షోను రంజుగా మారుస్తున్నారు. ఇందులో భాగంగానే హౌస్‌లోకి ఊహించని అతిథిని తీసుకొచ్చారు. అది ఎవరో కాదు.. కంటెస్టెంట్లను భయపెట్టే దెయ్యం. అవును.. బిగ్ బాస్ షోలకి దెయ్యం ఎంట్రీ ఇచ్చింది.

Recommended Video

Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
ఎన్టీఆర్ సీజన్‌లో ఎంట్రీ.. మళ్లీ ఇప్పుడు

ఎన్టీఆర్ సీజన్‌లో ఎంట్రీ.. మళ్లీ ఇప్పుడు

ప్రస్తుత కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ అద్దంలో చూస్తున్న సమయంలో ఓ దెయ్యం రూపం కనిపించింది. దీంతో ఆమె బెంబేలెత్తిపోయింది. హౌస్‌మేట్స్ అందరూ ఉన్న భయంతో వణికిపోయింది. ఇది బుధవారం ప్రసారం కానుంది. ఇదిలాఉండగా, బిగ్ బాస్ షోలోనే ఎంతో ఫేమస్ అయిన ఈ దెయ్యం ఎపిసోడ్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1లోనే పరిచయం చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X