‘ఢీ’ షోలో స్పెషల్ గెస్ట్ హల్‌చల్: అందరి ముందే ప్రియమణిని ముద్దులు.. రష్మీని కూడా వదలి పెట్టలేదు!

తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా తన ముద్రను చూపిస్తూ దక్షిణాదిలోనే నెంబర్ వన్ డ్యాన్స్ రియాలిటీగా వెలుగొందుతోంది 'ఢీ'. 2009లో ప్రారంభం అయిన ఈ షో.. అప్పటి నుంచి హవాను చూపిస్తూనే ఉంది. ప్రముఖ ఛానెల్‌లో ప్రతి బుధవారం ప్రసారం అవుతోన్న దీనికి భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. ఈ కారణంగానే ఇప్పటికే ఏకంగా 12 సీజన్లను పూర్తి చేసుకుందీ షో.

ఇటీవలే 13వ సీజన్‌ను సైతం ప్రారంభించారు. తాజాగా 'ఢీ' షోలోకి స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. అందరితో కలిసి సందడి చేసిన ఆ అతిథి జడ్జ్ ప్రియమణికి ముద్దుల మీద ముద్దులిచ్చారు. రష్మీ గౌతమ్‌ను కూడా వదిలిపెట్టలేదు. ఆ వివరాలు మీకోసం!

‘ఢీ' ఛాంపియన్స్ టైటిల్ కొట్టిన పియూష్

‘ఢీ' ఛాంపియన్స్ టైటిల్ కొట్టిన పియూష్

ఈ ఏడాది మొత్తం ‘ఢీ ఛాంపియన్స్' పేరిట 12వ సీజన్‌ను నడిపించారు షో నిర్వహకులు. ఇప్పటి వరకు ఈ షోలో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్న.. టైటిల్ సంపాదించిన వారిని ఇందులోకి తీసుకొచ్చారు. సుదీర్ఘంగా సాగిన ఈ సీజన్‌లో యశ్వంత్ మాస్టర్ కంటెస్టెంట్ పియూష్ విజేతగా నిలిచాడు. ఫినాలేలో చిట్టి మాస్టర్ కంటెస్టెంట్ సోమేష్‌పై అతడు విజయం సాధించాడు.

‘కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట మొదలెట్టారు

‘కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట మొదలెట్టారు

సీజన్ సీజన్‌కు గ్యాప్ తీసుకుంటూ వచ్చింది ఢీ యాజమాన్యం. అయితే, ఈ సారి దీనికి భిన్నంగా 12వ సీజన్ ముగిసిన వెంటనే మరో దానిని ప్రారంభించారు. ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట మొదలైన దీనిలో అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య పోటీని పెట్టారు. ఈ సారి కొత్త కంటెస్టెంట్లను తీసుకొచ్చారు. అలాగే, కొరియోగ్రాఫర్లను కూడా చాలా వరకు కొత్త వారినే ఎంపిక చేసుకున్నారు.

ఆమె స్థానంలో టిక్‌టాక్ స్టార్‌ను తెచ్చారు

ఆమె స్థానంలో టిక్‌టాక్ స్టార్‌ను తెచ్చారు

రెండు మూడు సీజన్లుగా ఢీ షోలో టీమ్ లీడర్ కమ్ మెంటర్‌గా పని చేస్తోంది ప్రముఖ యాంకర్ వర్షిణి. అయితే, ఈ సారి ఆమెను తప్పించి.. టిక్ టాక్ యాప్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయిన దీపికను తీసుకొచ్చారు. ఆడవారి టీమ్‌కు ఆమెతో పాటు రష్మీ గౌతమ్ మెంటర్‌గా ఉంది. మగ కంటెస్టెంట్లకు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ప్రదీప్.... వాళ్లు కూడా

ప్రత్యేక ఆకర్షణగా ప్రదీప్.... వాళ్లు కూడా

తెలుగు బుల్లితెరపై ‘ఢీ' షోకు ఉన్న ప్రత్యేకతే వేరు. డ్యాన్సుకు డ్యాన్సు... ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇందులో యాంకర్ ప్రదీప్ మాచిరాజు చేసే అల్లరి ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే, సుధీర్, ఆదిలు పంచులు వేస్తూ సాగుతున్నారు. వీరికి తోడు రష్మీ గౌతమ్ కూడా తన గ్లామర్‌తో మైమరపిస్తుంటుంది

‘ఢీ' డ్యాన్స్‌ షోలో స్పెషల్ గెస్టు హల్‌చల్

‘ఢీ' డ్యాన్స్‌ షోలో స్పెషల్ గెస్టు హల్‌చల్

‘ఢీ' 13వ సీజన్‌లో భాగంగా ప్రసారం అవుతోన్న ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' వచ్చే వారం సందడిగా సాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇంతగా ట్రెండ్ అవడానికి కారణం ఆ ఎపిసోడ్‌కు స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇవ్వడమే. వచ్చిన ఆ ముఖ్య అతిథి జడ్జ్ ప్రియమణికి ముద్దులు పెట్టడంతో పాటు రష్మీ గౌతమ్‌ను కూడా వదిలి పెట్టలేదు.

ప్రియమణికి ముద్దులు.. రష్మీనీ వదల్లేదు

ప్రియమణికి ముద్దులు.. రష్మీనీ వదల్లేదు

అసలేం జరిగిందంటే.. ఢీ షోలోకి రవణమ్మ అనే వృద్ధురాలు వచ్చారు. ఆమె ద్వారా ప్రిమయణితో తనకు హగ్ ఇప్పించమని అడిగించాడు ఆది. అప్పుడు స్టేజ్ పైకి వచ్చిన ఆమె.. అతడిని కాదని.. గెస్టుకు హగ్ ఇచ్చింది. దీంతో ఆమె ప్రియమణికి ముద్దులు పెట్టింది. ఆ తర్వాత సుధీర్ కూడా ఇదే ఫాలో అయ్యాడు. అతడి కోరిక మేరకు రవణమ్మ రష్మీని అతడికి హగ్ ఇవ్వమని కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X