Bigg Boss Telugu 7: కెప్టెన్ అమర్‌దీప్‌‌కు ఎదురుదెబ్బ.. గట్టిగా ఇచ్చిపడేసిన స్పై బ్యాచ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అత్యద్భుతంగా సాగుతోంది. ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ కు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. షో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ రోజుకో ట్విస్ట్ తో అంతకు మించిన ఎమోషన్స్ పండించడంలో ఎప్పుడూ ముందుంటున్నారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. అయితే మొదటి వారంలో ఇంట్లో అడుగు పెట్టిన అమర్ దీప్.. యే టైటిల్ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. అతను గెలవడంలో ఎలాంటి మార్పూ ఉండదని భావించారు.

కానీ రెండో వారం నామినేషన్స్ లో భాగంగా.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకున్నాడు అమర్ దీప్. దాంతో అతడికి విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అదే సమయంలో ఇంట్లోని వాళ్లంతా పల్లవి ప్రశాంత్ ను వేరు చేసి చూస్తున్నా.. శివాజి మాత్రం అది తప్పని చెప్పాడు. అతడికి అండగా నిలబడి రైతుబిడ్డకు గెలిచే ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంట్లో ఉండి టాస్క్ లు ఆడే బలాన్ని ఇచ్చాడు. ఇలా ఇతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అలాగే వీరి గ్రూపులోనే ప్రిన్స్ యావర్ కూడా చేరిపోయాడు. ఇక అప్పటి నుంచి వీరి ముగ్గురూ ఓ జట్టుగా కొనసాగుతున్నారు.

SPY Batch Faires on Captain Amardeep About His Over Action in Bigg Boss Telgu 7 Check Details

మరోవైపు శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ లు ఓ జట్టుగా కొనసాగుతూ గేమ్ ఆడుకుంటూ వస్తున్నారు. ఫౌల్ గేమ్స్ ఆడుతూ.. గ్రూపు గేమ్ ఆడుతూ... స్పై బ్యాచ్ పై ఎప్పుడు చాడీలు చెబుతూ ఉంటారు. బిగ్ బాస్ ప్రేమ వల్లే వీరు ఇంత కాలం ఇంట్లో కొనసాగుతూ వస్తున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ అయితే కెప్టెన్ అవ్వాలని విపరీతంగా ప్రయత్నించాడు. ఫ్యామిలీ వీక్ ముందు వరకు ఇతడు టాప్ 5లో కూడా ఉండడని అంతా అనుకున్నారు. కానీ అదంతా రివర్స్ అయిపోయింది. 12వ వారం తర్వాత అయితే అతనే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం కూడా కనిపించింది.

కానీ మళ్లీ అంతలోనే అతను చేసిన పనలుకు గెగిటివ్ అవుతున్నాడు. టాప్ 1 నుంచి టాప్ 4కి పడిపోయాడు. ఎవరూ ఊహించని విధంగా ఒక్కోసారి ఒక్కోలా గేమ్ ఆడుతున్నాడు అమర్ దీప్. ముఖ్యంగా కెప్టెన్ అవ్వడం కోసం అతను ఎంత గట్టిగా టాస్క్ లు ఆడాడో, ఎంతగా ఏడ్చాడో అందిరకీ తెలిసిందే. ఆయన ఏడుపు చూసే చాలా మంది అతడికి ఓట్లు వేశారు. పాపం ఈ సారి అయినా కెప్టెన్ చేయమంటూ కోరారు. ముఖ్యంగా చివరి కెప్టెన్సీ టాస్క్ లో అయితే అతడిని కెప్టెన్ చేయకుండా ఉన్నందుకు శివాజికి విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఇదంతా చూసిన బిగ్ బాస్ పాపం అని ఈ వారం కెప్టెన్సీ ఇచ్చాడు. అమర్ ను కెప్టెన్ చేసేశాడు.

SPY Batch Faires on Captain Amardeep About His Over Action in Bigg Boss Telgu 7 Check Details

అయితే తాము కష్టపడి ఆడి గెలిచిన వాళ్లు కూడా కెప్టెన్ గా అంతా హవా చేయరు. కానీ అమర్ దీప్ మాత్రం ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేనే కెప్టెన్.. నా మాటే శాసనం అంటూ రచ్చ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు విడదల అయిన ప్రోమో చూస్తుంటే అమర్ ఏ రేంజ్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో అర్థం అవుతుంది. ఓటింగ్ అప్పీల్ కోసం అర్జున్, అమర్ లు చివరి వరకూ రాగా.. వాళ్లకు ఓట్లు వేయమని బిగ్ బాస్ చెప్పాడు. శివాజి, ప్రశాంత్, యావర్ లు అర్జున్ కు సపోర్ట్ చేయగా.. అమర్ కు ప్రియాంక, శోభాలు సపోర్ట్ చేశారు.

SPY Batch Faires on Captain Amardeep About His Over Action in Bigg Boss Telgu 7 Check Details

ఈక్రమంలోనే యావర్ చెప్పిన కారణాలకు ఫైర్ అవుతూ... ఐ యామ్ ద కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్.. నువ్వు అక్కడకు వెళ్లంటూ విపరీతంగా అరిచాడు. దీనిపై స్పై బ్యాచ్ కూడా కౌంటర్లు వేసింది. ముగ్గురూ అమర్ దీప్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అమర్ దీప్ చేసిన ఓవర్ యాక్షన్ పై నెటిజెన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. మీరూ ఓసారి ఈరోజుటి ప్రోమో చూసి అమర్ దీప్ అతిని కళ్లారా వీక్షించిండని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X